సౌండింగ్ రాకెట్ లాంచ్ చేసిన ఇస్రో

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సౌండింగ్ రాకెట్ లాంచ్ చేసింది. తటస్థ గాలుల్లోని వైఖరిలోని వైవిధ్యాలను, ప్లాస్మా డైనమిక్స్ స్టడీ చేసేందుకు శుక్రవారం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శ్రీహరి కోటలో లాంచ్ చేశారు.

సౌండింగ్ రాకెట్ లాంచ్ చేసిన ఇస్రో

Isro Sounding Rocket

ISRO Sounding Rocket: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సౌండింగ్ రాకెట్ లాంచ్ చేసింది. తటస్థ గాలుల్లోని వైఖరిలోని వైవిధ్యాలను, ప్లాస్మా డైనమిక్స్ స్టడీ చేసేందుకు శుక్రవారం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శ్రీహరి కోటలో లాంచ్ చేశారు.

‘తటస్థ గాలుల్లోని వైఖరిలోని వైవిధ్యాలను, ప్లాస్మా డైనమిక్స్ స్టడీ చేసేందుకు శుక్రవారం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శ్రీహరి కోటలో లాంచ్ చేశాం’ అని ఇస్రో అఫీషియల్ అకౌంట్లో ట్వీట్ చేసింది. ఇస్రో కథనం ప్రకారం.. స్పేస్ రీసెర్చ్ కోసం రెండు స్టేజిల ప్రోపెల్లంట్ రాకెట్స్ వాడి ఉపరితల వాతావరణాలకు అనుగుణంగా తయారుచేశారు.

‘కొత్త కాంపోనెంట్స్ లేదా సబ్ సిస్టమ్స్ ప్రొటోటైపులను టెస్టు చేసేందుకు లేదా.. వెహికల్స్, శాటిలైట్స్ లాంచ్ చేసేందుకు సరైన పరిస్థితులను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇస్రో 1965నుంచే సౌండింగ్ రాకెట్లను లాంచ్ చేస్తూ వస్తుందని ‘ ఇస్రో చెప్పింది.

సౌండింగ్ రాకెట్ అంటే.. : ఒకటీ లేదా రెండు దశలతో ఉండే బలమైన ప్రొపెల్లాంట్ రాకెట్లు. ఇవి భూమి ఉపరితల వాతావరణాన్ని అంచనా వేస్తాయి. సోలార్ ప్లాస్మా స్థాయిలను లెక్కలేసి చెబుతాయి. డేటా ఆదారంగా అంతరిక్ష పరిశోధనలు సాగిస్తారు. ఈ రాకెట్లు తక్కువ బడ్జెట్‌లోనే తయారుచేస్తారు. ప్రస్తుతం ఇస్రో దగ్గర మూడు వెర్షన్ల సౌండింగ్ రాకెట్లు ఉన్నాయి. అవి RH-200, RH-300-Mk-II and RH-560-Mk-II. ఇవి 8 నుంచి 1000 కేజీల పేలోడ్‌ను… 80 నుంచి 475 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లగలవు.