Dabbawala Breakfast With Elizabeth-2: అప్పట్లో బర్మింగ్‌హామ్ ప్యాలెస్, విండ్సర్ కోటలో ఎలిజబెత్-2తో బ్రేక్ ఫాస్ట్ చేశాం: గుర్తుచేసుకున్న డబ్బావాలాలు

ఈ విషయంపై టిఫిన్ బాక్స్ సఫ్లయర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ రఘునాథ్ మెగ్డే మాట్లాడుతూ... అప్పట్లో తాను మరో డబ్బావాలా సోపాన్ తో కలిసి లండన్ వెళ్ళానని చెప్పారు. రాణి ఎలిజబెత్‌-2తో మాట్లాడానని, ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని చెప్పారు. లండన్ లో ఎనిమిది రోజుల పాటు ప్రత్యేకంగా పర్యటించే అవకాశం వచ్చిందని అన్నారు. తాము రాణి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రెండు సార్లు బ్రేక్ ఫాస్ట్ చేశామని, ఎలిజబెత్-2 చాలా వినమ్రతతో ఉండేవారని చెప్పారు.

Dabbawala Breakfast With Elizabeth-2: అప్పట్లో బర్మింగ్‌హామ్ ప్యాలెస్, విండ్సర్ కోటలో ఎలిజబెత్-2తో బ్రేక్ ఫాస్ట్ చేశాం: గుర్తుచేసుకున్న డబ్బావాలాలు

Dabbawala Breakfast With Elizabeth-2

Dabbawala Breakfast With Elizabeth-2: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 (96) నిన్న స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో కన్నుమూయడంతో గతంలో ఆమెను కలిసిన రోజులను గుర్తు చేసుకున్నారు ముంబైలోని డబ్బావాలాలు. ముంబైలో వేలాదిమందికి భోజనం సరఫరా చేస్తారు డబ్బావాలాలు. ఉద్యోగస్థుల ఇంటి నుంచి టిఫిన్, లంచ్ బాక్సులు తీసుకెళ్ళి వారి ఆఫీసుల్లో ఇవ్వడం వంటి పనులు చేస్తుంటారు వారు. వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. వారిలో పలువురికి 2005, ఏప్రిల్ లో ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా పార్కర్ బౌల్స్ వివాహం జరిగింది. ఆ వివాహ మహోత్సవానికి ఎలిజబెత్‌ కుటుంబం నుంచి ఇద్దరు డబ్బావాలాలకు ఆహ్వానం అందింది.

ఈ విషయంపై టిఫిన్ బాక్స్ సఫ్లయర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ రఘునాథ్ మెగ్డే మాట్లాడుతూ… అప్పట్లో తాను మరో డబ్బావాలా సోపాన్ తో కలిసి లండన్ వెళ్ళానని చెప్పారు. రాణి ఎలిజబెత్‌-2తో మాట్లాడానని, ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశానని చెప్పారు. లండన్ లో ఎనిమిది రోజుల పాటు ప్రత్యేకంగా పర్యటించే అవకాశం వచ్చిందని అన్నారు. తాము రాణి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రెండు సార్లు బ్రేక్ ఫాస్ట్ చేశామని, ఎలిజబెత్-2 చాలా వినమ్రతతో ఉండేవారని చెప్పారు.

ఆ సమయంలో రాజస్థాన్ రాజ కుటుంబానికి చెందిన పద్మినీ దేవి కూడా వివాహానికి వచ్చారని, తాము రాణి ఎలిజబెత్ తో మాట్లాడే సమయంలో… తాము చెప్పేది ఇంగ్లిష్ లో రాణికి చెప్పారని, రాణి చెప్పిన విషయాన్ని హిందీలో తమకు చెప్పారని అన్నారు. తమ మధ్య అనువాదకురాలిగా వ్యవహరించి సాయం చేశారని అన్నారు. తాము మొదట రాణితో బర్మింగ్‌హామ్ ప్యాలెస్ లో బ్రేక్ ఫాస్ట్ చేశామని, అనంతరం విండ్సర్ కోటలోనూ బ్రేక్ ఫాస్ట్ చేశామని చెప్పారు. తమను బస్సులో తీసుకెళ్ళారని వివరించారు.

అప్పట్లో బ్రిటన్ నుంచి ఆహ్వానం అందుకున్న భారతీయులం తాము ముగ్గురం మాత్రమేనని అన్నారు. టిఫిన్లను ఎలా తీసుకెళ్ళి ఇస్తామన్న విషయంపై రాణి అడిగి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. రాణి ఎలిజబెత్ తో తాము సమావేశం అయిన తర్వాతే డబ్బావాలాల గురించి ప్రపంచానికి మరింత బాగా తెలిసిందని తెలిపారు. తమను రాణి కుటుంబంలోని వారు సొంత కుటుంబ సభ్యుల్లాగే చూశారని తెలిపారు.

Hyderabad Metro: నేడు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల సేవలు