ఐదు నెలల్లో 68వేల రేషన్ కార్డులు తొలగించిన రాష్ట్రం

ఐదు నెలల్లో 68వేల రేషన్ కార్డులు తొలగించిన రాష్ట్రం

ration-card

Jharkhand: డ్యూప్లికేట్ రేషన్ కార్డులు తొలగించాలని పూనుకున్న జార్ఖండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ 67వేల 780కార్డులను తొలగించింది. జులై నుంచి డిసెంబర్ మద్య కాలంలో ఈ ప్రక్రియ చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 2.62కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారని చెప్పింది.

గతేడాది జులై నుంచి డిసెంబర్ వరకూ 3.16లక్షల రేషన్ కార్డ్ హోల్డర్లు 2.62లక్షల వరకూ తగ్గిపోయారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్ట ప్రకారం.. 29.89లక్షల మంది బెనిఫిషియరీస్ కు గత ఐదేళ్లుగా రేషన్ కార్డ్ అందడం లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కేటాయించదాని కంటే.. ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి.

జార్ఖండ్ ప్రభుత్వం.. తన సొంత పథకాన్ని మొదలుపెట్టి జార్ఖండ్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ స్కీం కింద ఒక్కొక్కరికీ 5కేజీల బియ్యం కేజీ రూపాయి చొప్పున 15లక్షల మందికి పైగా ఇస్తున్నారు. 28.89లక్షల మందికి పైగా గ్రీన్ రేషన్ కార్డులు ఉన్నాయి.