జియో రీఛార్జ్ రూ.11కే 1జీబీ డేటా.. ఎయిర్‍‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్?

జియో రీఛార్జ్ రూ.11కే 1జీబీ డేటా.. ఎయిర్‍‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్?

Jio Recharge: రిలయన్స్ జియో రూ.11 డేటా యాడ్ ఆన్ ప్లాన్‌ను రివైజ్ చేసింది. ప్రస్తుతం ఈ రీఛార్జ్ కు 1జీబీ డేటా ఇస్తుంది. అసలు ముందుగా రూ.11 రీఛార్జ్ చేసుకుంటే.. 400Mb డేటా మాత్రమే వచ్చేది. దానిని రివైజ్ చేసి 800Mb వరకూ డేటా వచ్చేలా చూశారు. ఇప్పుడు అది కాస్తా 1జీబీ డేటా అయింది.

జియోకు రూ.51 డేటా యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది. దీంతో 6జీబీ డేటా వస్తుండగా, రూ.101ప్లాన్ తో 12జీబీ డేటా వస్తుంది. ఇవే కాకుండా ఇంకొక ప్లాన్ ఏంటంటే రూ.21 ప్లాన్ దీనికి 2జీబీ డేటా వస్తుంది. ఇది ఇలా ఉంటే.. మరి ఎయిర్‌టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌లు డేటాను ఎలా అందిస్తున్నాయో తెలుసా..

ఎయిర్‌టెల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్
ఎయిర్ టెల్ డేటా ప్యాక్ కోసం రూ.78 కేటాయిస్తే 5జీబీ డేటా వస్తుంది. ఒరిజినల్ ప్లాన్ ముగిసేంతవరకూ ఇది కంటిన్యూ అవుతుంది. ఈ ప్లాన్ ప్రకారం.. వచ్చిన 5జీబీ వాడేసిన తర్వాత ఒక్కో ఎంబీకి రూ.50పైసలు చొప్పున వసూలుచేస్తారు. ఈ ప్లాన్ తో పాటుగా నెల రోజుల పాటు వింక్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు.

వొడాఫోన్ డేటా పాన్లు:
యూజర్లు తమ ఛాయీస్ గా కావాలనుకునేవారు రూ.49కే 3జీబీ డేటా ప్లాన్ 28రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది. కంపెనీలో అఫీషియల్ డేటా ప్రకారం.. రూ.98 డేటా ప్లాన్ తో 12జీబీ డేటా వస్తుంది. రూ.401డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసకుుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, 30జీబీ డేటా 28రోజుల పాటు వస్తుంది. రూ.251డేటా ప్లాన్ తో 50జీబీ డేటా వస్తుండగా ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ గడువు కాలం వరకూ అది పని చేస్తుంది.

బీఎస్ఎన్ఎల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్:
బీఎస్ఎన్ఎల్ రూ.56 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్ తో అదనంగా 10జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 10రోజుల పాటు ఉంటుంది. ఇదే కాకుండా బీఎస్ఎన్ఎల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కు రూ.151తో రీఛార్జ్ చేసుకుంటే 30రోజుల పాటు 40జీబీ డేటా.. రూ.251 రీఛార్జ్ తో 70జీబీ డేటా మీ సొంతం.