Bihar Politics Crisis: ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని నడ్డా అన్నారు.. ఇప్పుడేమైంది?: తేజస్వీ యాదవ్

ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఇవాళ నితీశ్ కుమార్ తో గవర్నర్ ను కలిసిన అనంతరం తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ''ప్రజలను బెదిరించడం, కొనడం మాత్రమే బీజేపీకి తెలుసు. బిహార్ లో బీజేపీ అజెండా అమలు కావద్దని మేము కోరుకున్నాం'' అని అన్నారు. ఇప్పుడు తాము కోరుకున్నదే జరుగుతోందని చెప్పారు.

Bihar Politics Crisis: ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని నడ్డా అన్నారు.. ఇప్పుడేమైంది?: తేజస్వీ యాదవ్
ad

Bihar Politics Crisis: ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఇవాళ నితీశ్ కుమార్ తో గవర్నర్ ను కలిసిన అనంతరం తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ”ప్రజలను బెదిరించడం, కొనడం మాత్రమే బీజేపీకి తెలుసు. బిహార్ లో బీజేపీ అజెండా అమలు కావద్దని మేము కోరుకున్నాం” అని అన్నారు. ఇప్పుడు తాము కోరుకున్నదే జరుగుతోందని చెప్పారు.

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీతో ఏ పార్టీ కూడా మిత్రత్వాన్ని కొనసాగించడం లేదని తేజస్వీ యాదవ్ అన్నారు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలను బీజేపీ నాశనం చేస్తుందని మనకు చరిత్ర చెబుతోందని విమర్శించారు. పంజాబ్ లో, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నామని తేజస్వీ యాదవ్ అన్నారు. నితీశ్ కుమార్‌తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు.

బీజేపీ అజెండా బిహార్ లో అమలు కాకుండా చూడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.  ‘గతంలో అద్వానీ రథయాత్రను లాలూజీ అడ్డుకున్నారని అందరికీ తెలుసు. లాలూజీ వారసత్వ లక్షణాలను మేము వదులుకోము. మన పూర్వీకుల వారసత్వాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి పిలుపు రాగానే నితీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, అధికారం కోసమే నితీశ్ కుమార్ పాకులాడుతున్నారని, ఆయన తీసుకునే నిర్ణయాల్లో నైతికత ఏమీ లేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు.

Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్