‘కూ’ పర్సనల్ డేటా లీక్ చేస్తుందంటోన్న ఫ్రెంచ్ హ్యాకర్

‘కూ’ పర్సనల్ డేటా లీక్ చేస్తుందంటోన్న ఫ్రెంచ్ హ్యాకర్

Koo App: ఇండియన్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాం ‘కూ’ ఇండియన్ లాంగ్వేజెస్ తో అందుబాటులో ఉన్న ట్విట్టర్ అని కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ రోబర్ట్ బాప్టిస్టి కూ.. పర్సనల్ డేటా ఎక్స్‌పోజ్ చేస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ యూజర్ల రిక్వెస్ట్ మేరకు ఓ 30నిమిషాల పాటు కూ.. యాప్ పై పనిచేశారట. అప్పుడే అర్థమైందట తనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్‌పోజ్ అవుతుందని. ఈమెయిల్ అడ్రస్, పేరు, జెండర్ లాంటివన్నీ బయటకు తెలిసిపోతున్నాయి.

దీనిపై వరుస ట్వీట్లు చేశాడు కూడా. గవర్నమెంట్ రిక్వెస్ట్‌తో రైతు ఆందోళనలపై ట్వీట్లు చేస్తున్న ప్రముఖురిని ట్విట్టర్ బ్లాక్ చేసింది. అదే సమయంలో ఈ కొత్త సోషల్ మీడియా యాప్ కు భారీగా స్పందన వచ్చింది. అతను పోస్టు చేసిన స్క్రీన్ షాట్లలో యూజర్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ఎలా బయటకు వచ్చిందో చూపించాడు. జీ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిషియల్ స్టేటస్, జెండర్ లాంటివన్నీ కనిపిస్తున్నాయి.

కూ యాప్ డొమైన్ యూఎస్ లో రిజిష్టర్ అయిందని.. దాని రిజిష్ట్రంట్ చైనాకు చెందినవాడని ఈ ఫ్రెంచ్ హ్యాకర్ చెప్తున్నాడు. ఈ ఇండియన్ ట్విట్టర్ చూడటానికి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కలిసి ప్రమోట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ ట్విట్టర్ ద్వారా కూలో జాయిన్ అవ్వాలంటూ ఇన్విటేషన్ పంపించారు. ప్రస్తుతం ఈ యాప్ డెస్క్ టాప్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో ట్విట్టర్ లాగే ఇండియన్ భాషల్లో అందుబాటులో ఉంది.

గతేడాది డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేటివ్ ఛాలెంజ్ లో భాగంగా.. యాప్ రెడీ అయింది. లోకల్ యాప్ డెవలప్మెంట్ ను ఎంకరేజ్ చేసే దిశగా ఈ ప్రయత్నాలు జరిగాయి. గతేడాది మార్చిలో లాంచ్ అయిన ఈ యాప్‌కు సహ వ్యవస్థాపకులతో పాటు సీఈఓగా అప్రమేయ రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు.

ఇది డేటా లీక్ కాదని.. నేరుగా డేటా ఎక్స్‌పోజ్ జరుగుతుందంటూ ఆరోపిస్తూ ఉదహరణగా స్క్రీన్ షాట్లు పోస్టు చేశారు.