KTR slams bjp: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మోదీ ఆపారట: కేటీఆర్ ఎద్దేవా
కేటీఆర్ మాట్లాడుతూ... మోదీని బీజేపీ నేతలు ఆకాశానికెత్తేస్తున్నారని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జరుగుతున్న గొడవను కూడా మోదీ ఆపలేకపోయారని, ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉందని చెప్పారు. అటువంటిది, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మోదీ ఆపారని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR slams bjp: బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… మోదీని బీజేపీ నేతలు ఆకాశానికెత్తేస్తున్నారని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జరుగుతున్న గొడవను కూడా మోదీ ఆపలేకపోయారని, ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉందని చెప్పారు. అటువంటిది, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మోదీ ఆపారని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మోదీ ప్రభుత్వం కొత్తగా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. ఈ రాష్ట్రంలోని యువత గుర్తించాలని అన్నారు. పేరు కేమో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని, చేతల్లోనేమో ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై కక్ష కట్టి పనిచేస్తున్నారని అన్నారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదని కేటీఆర్ చెప్పారు. పసుపుబోర్డు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో ఉన్న మంచి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవని చెప్పారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 60 లక్షల మందికి రైతు బంధు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. తాము రూ.65000 కోట్ల రైతు బంధు సాయం చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించిందని తెలిపారు. తాము కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో నిర్మించామని అన్నారు.
Hindenburg Report On ADANI Group: 6 గంటల్లో 1.60 లక్షల కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానీ