లిక్కర్ తాగి దొరికితే జాబ్ పీకేస్తామంటోన్న సీఎం

లిక్కర్ తాగి దొరికితే జాబ్ పీకేస్తామంటోన్న సీఎం

Liquor Ban in Bihar: పోలీసులు ఎవరైనా.. ఆల్కహాల్ తాగి దొరికారంటే ఉద్యోగాలు ఊడిపోతాయమని బీహార్‌ సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎం నితీశ్ కుమార్.. సోమవారం పోలీసు అధికారులు ఆల్కహాల్ తీసుకోమని ప్రమాణం చేయాలని సూచించారు. ఒకవేళ అతిక్రమించి పోలీసులెవరైనా తాగి ఉన్నట్లు దొరికితే వాళ్ల ఉద్యోగం వెంటనే తీసేస్తామని చెప్పారు.

వాచ్‌మెన్ కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మద్యపాన నిషేదం సందర్భంగా పలు సూచనలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి.. ఏదైనా అల్లర్లు జరిగినట్లు తెలిస్తే.. చర్యలు తీసుకుంటాం. మద్యపాన నిషేదం చేయడానికి ముందు లిక్కర్ బిజినెస్ చేసేవారు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ఆల్కహాల్ తాగడం.. ఆ మత్తులో గొడవలు చేయడం వంటివి సహించేది లేదని సీఎం అన్నారు. అలా దొరికిపోతే మాత్రం బహిరంగ శిక్ష విధిస్తామని.. పరువు పోతుందేమోననే భయంతోనైనా ఆల్కహాల్ కు దూరంగా ఉంటారని చెప్పారు.

2017లో ఇలాగే ఎలక్ట్రిక్ పోల్స్ మీద ఫోన్ నెంబర్లు రాయించారు. అలా ఎవరైతే గొడవలు, అలర్లు చేస్తున్నారో వారి గురించి కంప్లైంట్ ఈజీగా ఇవ్వొచ్చు. ఒక వ్యక్తిపై టెలిఫోన్ లో లేదా ప్రత్యక్షంగా.. ఎక్కువ సార్లు కంప్లైంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకున్నారు.