పెళ్లికి వచ్చి.. యువతులతో కలిసి చిందేసిన సీఎం

పెళ్లికి వచ్చి.. యువతులతో కలిసి చిందేసిన సీఎం

Mamata Banerjee: ఫంక్షన్లు, పార్టీలన్నాక ఎంజాయ్మెంట్ కామన్. సాధారణ వ్యక్తులు ఎంజాయ్ చేయడం ఒకటైతే రాజకీయాల్లో ఫుల్‌ బిజీగా ఉండే సీఎం స్థాయి వ్యక్తి డ్యాన్స్ చేయడం గొప్ప కాదా మరి. కళాకారులతో కలిసి స్వయంగా సీఎంనే స్టెప్పులేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగానూ ఆమె హాబీలు ప్రజలతో పంచుకుంటూ ఉంటారు.

పుస్తకాలు రాయడం.. పెయింటింగ్‌ వేయడం తదితర పనులతో రిఫ్రెష్ అవుతుంటారు. అప్పుడప్పుడు సంప్రదాయ నృత్యం చేసే ఆమె.. తాజాగా ఓ వివాహ వేడుకలో కళాకారులతో కలిసి నృత్యం చేయడం ఆకట్టుకుంది.

అలీపుర్దార్ జిల్లా ఫలకటా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ మంగళవారం సామూహిక వివాహాలు జరిపింది. ఈ సందర్భంగా సీఎం మమతా చీఫ్ గెస్ట్‌గా అటెంట్ అయి నూతన జంటలకు ఆశీర్వాదం అందించారు. అనంతరం అక్కడ గిరిజన యువతులు చేస్తున్న సంప్రదాయ నృత్యంలో కాలు కదిపారు. దరువుకు అనుగుణంగా బెంగాల్‌ సంప్రదాయ నృత్యం చేశారు.

ఆ పక్కనే మరో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని సీఎం మమత కళాకారులతో కలిసిపోయారు. ఆమె డ్యాన్స్‌ చేయడంతో ఉత్సాహం రెట్టింపు అయి అక్కడున్న వారంతా ఈలలు.. చప్పట్లతో మార్మోగించారు. మమతాబెనర్జీ ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తుంటారు.

బెంగాల్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. టీఎంసీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. రెండు సార్లు సీఎంగా బాధ్యతలు వహించిన మమతా మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.