Gujarat: వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష

వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష పడింది. గుజరాత్ లోని అహ్మదాబాబ్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధులు, రోడ్లపై పశువులు బీభత్సం సృష్టిస్తూ మనుషులకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో వాటిని అలా వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది.

Gujarat: వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష

Gujarat: వీధుల్లోకి ఆవులను వదిలినందుకు వాటి యజమానికి 6 నెలల జైలు శిక్ష పడింది. గుజరాత్ లోని అహ్మదాబాబ్ మునిసిపల్ కార్పొరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధులు, రోడ్లపై పశువులు బీభత్సం సృష్టిస్తూ మనుషులకు ముప్పుగా మారుతున్న నేపథ్యంలో వాటిని అలా వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది.

షాపూర్ కు చెందిన ప్రకాశ్ జైరాం దేశాయ్ అనే వ్యక్తి తన ఐదు ఆవులను రోడ్లపై విడిచేశాడని 2019, జూలై 27న కేసు నమోదైంది. అతడు విడిచిన ఆవులు ఎవరికీ ప్రమాదం చేకూర్చకపోయినప్పటికీ అతడి చర్య వల్ల ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రయల్ కోర్టు చెప్పింది. పలు ప్రాంతాల్లో వీధుల్లో పశువులు తిరుగడం వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేసింది.

జైరాం దేశాయ్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9,100 జరిమానా కూడా విధించింది. కాగా, తనపై కేసు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విచారణ సందర్భంగా అధికారులను దేశాయ్ హెచ్చరించాడు. దీనిపై కూడా దేశాయ్ కి కోర్టు తగిన శిక్ష విధించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..