హిట్ మ్యాన్ రికార్డు బ్రేక్ చేసిన గఫ్తిల్

హిట్ మ్యాన్ రికార్డు బ్రేక్ చేసిన గఫ్తిల్

rohit sharma martin guptil

Rohit Sharma record break: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేశాడు న‌్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ మార్టిన్ గ‌ప్టిల్. హిట్ మాన్ పేరిట ఉన్న టీ20ల్లో అరుదైన రికార్డును తిర‌గ‌రాశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గ‌ఫ్తిల్ కేవ‌లం 50 బంతుల్లోనే (8 సిక్స్‌లు, 6 ఫోర్లు)తో కలిపి 97 ప‌రుగులు పూర్తి చేయగలిగాడు. ఇలా టీ20ల్లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు.

గ‌ఫ్తిల్ ఇప్ప‌టి వ‌ర‌కు 96 టీ20లు ఆడి 132 సిక్స్‌లు కొట్టాడు. ఈ రికార్డు రోహిత్ శ‌ర్మ పేరిట (127 సిక్స్‌లు, 108 మ్యాచ్‌లు)గా ఉండేది. ఇద్ద‌రి త‌ర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (97 మ్యాచ్‌ల‌లో 113 సిక్స్‌లు), న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మ‌న్రో (107), విండీస్ వీరుడు క్రిస్ గేల్ (105) ఉన్నారు. గేల్ కేవ‌లం 58 మ్యాచ్‌ల‌లోనే ఇన్ని సిక్స‌ర్లు బాదడం విశేషం.

న్యూజిలాండ్ 5 ప‌రుగుల‌తో విజ‌యం సాధించడానికి గ‌ఫ్తిల్ జోరు కీలకంగా మారింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌.. గ‌ఫ్తిల్ మెరుపు ఇన్నింగ్స్‌ సహకారంతో 20 ఓవ‌ర్లలో 219 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా విజ‌యానికి చేరువ‌కాగా 5 ప‌రుగుల దూరంలో ఆగిపోయింది. అలా మ్యాచ్ గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 లీడ్‌ దక్కించుకుంది.

15 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. నీష‌మ్ వేసిన చివరి ఓవర్లో ఆస్ట్రేలియా 10 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లగడంతో పరాజయం తప్పలేదు. చివ‌రి ఓవ‌ర్లో నీష‌మ్ 2 వికెట్లు తీయ‌డం విశేషం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మార్కస్ స్టోయినిస్ 37 బంతుల్లోనే 78 పరుగులు చేసి పోరాడినా పరాభవం తప్పలేదు.