స్పృహలోనే ఉన్నానంటోన్న మియాఖలీఫా.. రైతులకు ఇంకా సపోర్ట్

స్పృహలోనే ఉన్నానంటోన్న మియాఖలీఫా.. రైతులకు ఇంకా సపోర్ట్

chakka-jam-that-farmers

Mia Khalifa: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి ఆందోళన చేస్తూనే ఉన్నారు. దేశ రాజధానిలో వ్యక్తపరుస్తున్న నిరసనపై అంతర్జాతీయంగా స్పందన వస్తుంది. ఈ ఉద్యమంపై అమెరికన్‌ పాప్‌ సింగర్‌ రిహాన్నా, యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌, మాజీ పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫాలు మంగళవారం ట్విటర్‌ ద్వారా తమ సపోర్ట్ వ్యక్తపరిచారు.

రెండ్రోజుల క్రితం మియా ఖలీపా ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘ మానవ హక్కులకు భంగం కలిగేంతలా ఏం జరుగుతోందని న్యూఢిల్లీలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపేశార’ని పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా చేసిన మరో ట్వీట్‌లో.. రైతులను పెయిడ్‌ యాక్టర్లు అంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీనిపై కొంతమంది వ్యక్తులు మండిపడ్డారు. ‘మియా ఖలీఫా స్పృహలోకి రా!’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో ట్వీట్ తో బదులిచ్చారు. శుక్రవారం ట్విటర్‌లో ‘ స్పృహలోనే ఉన్నా అని కన్ఫామ్ చేస్తున్నా. అనవసరంగా నా మీద అక్కర చూపుతున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా’ అని స్పష్టం చేశారు.

మరోవైపు, రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్, పాప్ సింగర్ రిహన్నా తదితరులపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ సహా పలువురు విరుచుకుపడ్డారు. గ్రెటాపై ఢిల్లీలో కేసు కూడా నమోదైంది.