కుల్దీప్‌ను ఇంకెప్పుడు ఆడిస్తారంటూ టీమిండియా ఎంపికపై మైకేల్ వాన్ సెటైర్లు

కుల్దీప్‌ను ఇంకెప్పుడు ఆడిస్తారంటూ టీమిండియా ఎంపికపై మైకేల్ వాన్ సెటైర్లు

Kuldeep Yadav: ఇంగ్లాండ్ తో తొలి టెస్టు మ్యాచ్ కు నదీమ్, రాహుల్ చాహర్ లను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆల్ రౌండర్ అక్సర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. మరి కుల్దీప్ యాదవ్ ను తుదిజట్టులోకి ఎంపిక చేసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో మైకేల్ వాన్ కూడా ఒకరు.

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడబోయే టీమిండియా తుది జట్టును ఎంపికను చూసి ఆశ్చర్యంగా అనిపించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో అక్సర్ పటేల్ గాయం కారణంగా దూరమయ్యాడు. సహజంగానే అతనిస్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడతాడని ఆశించారు.

కానీ, టీమిండియా మేనేజ్మెంట్ షబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్లను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత తుది జట్టులో రాహుల్, నదీమ్ లు కనిపించారు. కేకేఆర్ స్పిన్నర్ కు జరిగిన అన్యాయానికి మైకేల్ వాన్ లాంటి మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా చేసిన తప్పుడు నిర్ణయమని పేర్కొంటూ.. ఎంపిక ఎలా జరిగిందని ప్రశ్నించారు. స్వదేశంలో మ్యాచ్ జరిగినప్పుడే కుల్దీప్ ను ఆడనివ్వకపోతే ఇంకెప్పుడు ఆడతాడని ప్రశ్నిస్తున్నారు.