ఇంగ్లాండ్ పర్‌ఫార్మెన్స్ పొగిడి చిక్కుల్లో పడ్డ మైకెల్ వాన్

ఇంగ్లాండ్ పర్‌ఫార్మెన్స్ పొగిడి చిక్కుల్లో పడ్డ మైకెల్ వాన్

Michael Vaughan

Michael Vaughan: టీమిండియా గురువారం రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో డై అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో గెలుపొందింది. మొతెరా(మోడీ) స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ల ప్రదర్శన పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుంటే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీస్తున్నాయి.

అక్సర్ పటేల్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ తన 400వ టెస్టు వికెట్ తీయడంతో సెకండ్ ఇన్నింగ్స్ ను 81పరుగులతో.. తొలి ఇన్నింగ్స్ ను 112 పరుగులతో ముగించారు. ఇండియా 99పరుగులకే 3వికెట్లు కోల్పోవడం, 145పరుగులకే ఆల్ అవుట్ అవడంతో అంతా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను పొగిడేశారు. అలాగే మైకేల్ వాన్ కూడా ఇంగ్లాండ్ టీంకు కంగ్రాట్స్ చెప్పాడు.

‘ఇంగ్లాండ్ ఇప్పుడు ఫేవరేట్స్ గా మారిపోయింది.. ఇంక్రెడిబుల్ సెషన్ ఇది’ అనే కామెంట్ తో పోస్టు పెట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 112పరుగులకే చాప చుట్టేసింది ఇంగ్లాండ్.

నెటిజన్లు మైకెల్ వాన్ ను టార్గెట్ చేస్తూ..
* మ్యాచ్ మొత్తం చూడు.
* క్రికెట్ గురించి మైకెల్ వాన్ కు ఇంతే తెలుసా. ఇతను కెప్టెన్సీ చేశాడని అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు.
* ఇంగ్లాండ్ బ్యాటింగ్ కంటే మైకెల్ వాన్ అంచనానే చెత్తగా ఉంది.
* విమర్శలు ఫేవరేట్స్ నుంచి పిచ్ మీదకు వచ్చేశాయి. మీ బ్యాట్స్ మెన్ కు అంత సినిమా లేదని ఒప్పుకోండి.
* ఇలా పలురకాలుగా ట్వీట్లతో టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మైకెల్ వాన్ అక్కడితో ఆగకుండా.. టెస్టు క్రికెట్ కు ఈ పిచ్ సరిపడదు. డే2 మొత్తం లాటరీతో నడిచిందని మళ్లీ ట్వీట్ చేశాడు. ముందు ఇంగ్లాండ్ బౌలర్లు బాగా ఆడారని, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యేసరికి పిచ్ బాగేలేదని అనడం పట్ల మరోసారి బలైపోయాడు.