Covid Vaccines: త్వరలోనే అందుబాటులోకి మరో 2 వ్యాక్సిన్లు..!

ఒమిక్రాన్ రూపంలో కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న వేళ.. దేశంలో త్వరలోనే మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Covid Vaccines: త్వరలోనే అందుబాటులోకి మరో 2 వ్యాక్సిన్లు..!

Vaccine

Covid Vaccines: ఒమిక్రాన్ రూపంలో కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న వేళ.. దేశంలో త్వరలోనే మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవోవ్యాక్స్, కార్బెవ్యాక్స్ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలంటూ.. డీసీజీఐకి సీడీఎస్‌సీవో నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి సాంకేతికత పొందిన సీరం సంస్థ కొవోవాక్స్ పేరుతో టీకాను ఉత్పత్తి చేసింది.

కార్బెవ్యాక్స్ టీకాను బయోలాజికల్ ఈ.. సంస్థ రూపొందించింది. ఈ రెండు టీకాల అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో.. డీసీజీఐ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అనుమతి లభిస్తే.. వెంటనే టీకాలను జనానికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 2 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పటికే రెండు కరోనా వేవ్ లతో అన్ని రకాలుగా ఇబ్బందిపడిన మన దేశంలో.. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. వ్యాక్సినేషనే ఉత్తమ మార్గమని కేంద్రం భావిస్తోంది. డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని ఇంకా మరిచిపోకముందే.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తీరుపై.. కేంద్రం ఈ సారి కాస్త ముందుగానే అప్రమత్తమైంది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను వేగంగా జనానికి అందిస్తోంది. త్వరలోనే.. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికీ టీకాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో.. మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే.. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడికి మరింత అవకాశం దొరికినట్టు అవుతుందని అధికారులు సైతం భావిస్తున్నారు.