Madhya Pradesh Minister on ‘Adipurush’: ‘ఆదిపురుష్’లోని అభ్యంతరకర సీన్లను తీసేయాలి.. లేదంటే..: మధ్యప్రదేశ్ హోం మంత్రి

"ఆదిపురుష్ సినిమాను తీసిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. హిందువుల నమ్మకాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తప్పుడు పద్ధతిలో తీయడం సరికాదు. ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను తీసేయాలని నేను ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తున్నాను. ఒకవేళ వాటిని తీయకపోతే నాయపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

Madhya Pradesh Minister on ‘Adipurush’: ‘ఆదిపురుష్’లోని అభ్యంతరకర సీన్లను తీసేయాలి.. లేదంటే..: మధ్యప్రదేశ్ హోం మంత్రి

Madhya Pradesh Minister on ‘Adipurush’: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాపై రాజకీయ నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో రావణుడి పాత్రను కూడా అందులో చూపించారు. ఆ పాత్రను రూపొందిచిన తీరుపై ఇప్పటికే బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్ మండిపడ్డారు. ఇప్పుడు దీనిపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఆదిపురుష్ సినిమాను తీసిన తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. హిందువుల నమ్మకాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తప్పుడు పద్ధతిలో తీయడం సరికాదు. ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను తీసేయాలని నేను ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తున్నాను. ఒకవేళ వాటిని తీయకపోతే నాయపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

కాగా, ఆదిపురుష్ సినిమా వీఎఫ్ఎక్స్ పై ఒకవైపు నెటిజన్ల నుంచి భారీగా ట్రోలింగ్ వస్తుండగా, ఇప్పుడు రావణుడి పాత్ర గురించి రాజకీయ నాయకుల నుంచి కూడా విమర్శలు వస్తుండడం గమనార్హం. బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్​​ ట్విటర్ లో దీనిపై స్పందిస్తూ… వాల్మీకి రాసిన రామాయణంతో పాటు తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర గురించి ఆదిపురుష్ దర్శకుడు​ ఓం రౌత్ అధ్యయనం చేయలేదేమోనని విమర్శించారు. ఆదిపురుష్ టీజర్​లో రావణుడి పాత్రలోని వ్యక్తి నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసుకున్నట్లు చూపించారని ఆమె చెప్పారు. ఔం రౌత్ తీస్తున్న రావణుడు మాత్రం టర్కిష్ నిరంకుశుడిలా అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..