Tejashwi Yadav on Alliance: ఇది స‌హ‌జ సిద్ధ‌మైన కూట‌మి.. ఒప్పందం కాదు: తేజ‌స్వీ యాదవ్

బిహార్‌లో తాము ఏర్పాటు చేసింది సహజ సిద్ధమైన కూటమి అని, ఇది ఒప్పందం కాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన నిజమైన మహా ఘట్ బంధన్ అని చెప్పారు. ఇటీవల నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతించామని, అందరమూ కలిశామని ఆయన తెలిపారు. తాము బీజేపీ తరహా రాజకీయాలు చేయబోమని అన్నారు. ఏ నేతనూ బెదిరించబోమని, డబ్బుతో కొనబోమని చెప్పుకొచ్చారు.

Tejashwi Yadav on Alliance: ఇది స‌హ‌జ సిద్ధ‌మైన కూట‌మి.. ఒప్పందం కాదు: తేజ‌స్వీ యాదవ్

Tejashwi Yadav on Alliance

Tejashwi Yadav on Alliance: బిహార్‌లో తాము ఏర్పాటు చేసింది సహజ సిద్ధమైన కూటమి అని, ఇది ఒప్పందం కాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమది లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన నిజమైన మహా ఘట్ బంధన్ అని చెప్పారు. ఇటీవల నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతించామని, అందరమూ కలిశామని ఆయన తెలిపారు. తాము బీజేపీ తరహా రాజకీయాలు చేయబోమని అన్నారు. ఏ నేతనూ బెదిరించబోమని, డబ్బుతో కొనబోమని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని యువతకు తాము ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వీ యాదవ్ అన్నారు. ముందుగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగ కల్పనపై తాము సీరియస్ గా ఉన్నామని అన్నారు. నెలరోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగాల ప్రకటన చేస్తామని చెప్పారు. పేదల పరిస్థితిని చూసి నితీశ్ కుమార్ చలించిపోయారని అన్నారు. ఇప్పుడు దేశానికి ఏం కావాలో అదే పనిని బిహార్ చేసిందని చెప్పారు. తాము దేశానికి మార్గాన్ని చూపామని అన్నారు. ఉద్యోగ కల్పన, పేదరికాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

కాగా, బీజేపీతో నితీశ్ కుమార్ మిత్రత్వాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, తమ పార్టీ ఆర్జేడీతో కలవడం ఆకస్మికంగా జరిగిన పరిణామంగా తేజస్వీ యాదవ్ తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆయన అన్నారు. బిహార్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించాయి. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా సమర్థంగా కూటమిని ఏర్పాటు చేయవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్