Bihar political crisis: 24న బలపరీక్ష ఎదుర్కోనున్న సీఎం నితీశ్ కుమార్

బిహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ కుమార్ అంటున్నారు. బిహార్‌లో మహాఘట్‌బంధన్ (మహా కూటమి) ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar political crisis: 24న బలపరీక్ష ఎదుర్కోనున్న సీఎం నితీశ్ కుమార్

Nitish rejects BJP claims over vice presidental candidate

Bihar political crisis: బిహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ కుమార్ అంటున్నారు. బిహార్‌లో మహాఘట్‌బంధన్ (మహా కూటమి) ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నితీశ్ కుమార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశం నిర్వహించి బలపరీక్షకు దిగాలని నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణ ఆగస్టు 16న జరగనుంది. కాంగ్రెస్ లో రెండు లేదా ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. వామపక్ష పార్టీలు కూడా మహాఘట్‌బంధన్ కు మద్దతు ప్రకటించాయి.

జేడీయూ కంటే ఆర్జేడీకి చెందిన నేతలే మంత్రి వర్గంలో అధికంగా ఉండనున్నారు. మహాఘట్‌బంధన్ లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ తో పాటు పలు ఇతర పార్టీలు స్వతంత్ర్య ఎమ్మెల్యేలూ ఉన్నారు. బిహార్ అసెంబ్లీలో బీజేపీకి 77 సీట్లు ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కుప్పకూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపీకి బిహార్ లో ఎవరూ ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది.

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్