Odisha train accident: మూడు రైళ్ల ఢీ: 230 మంది దుర్మరణం, 1000 మందికి గాయాలు

Odisha train accident: మూడు రైళ్ల ఢీ: 230 మంది దుర్మరణం, 1000 మందికి గాయాలు

trains accident

Odisha trains accident: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 230కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మొదట బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ జిల్లాలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలు ట్రాక్ పై పడ్డాయి.

అప్పుడే వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. దీని వల్ల కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. అనంతరం బోల్తాపడిన కోరమండల్ బోగీలపైకి గూడ్సు రైలు దూసుకువచ్చి ఢీకొంది. మూడు రైళ్లు ఒకదాంతో మరొకటి ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత అనూహ్యంగా పెరిగింది.

పట్టాలు బోగీల్లో నుంచి రాత్రివేళ బయటకు తీసుకువచ్చి వారిని కాపాడటానికి స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. దేశంలో ఇటీవల జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం అని చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని 115 అంబులెన్సుల్లో పలు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు ప్రయాణికులున్నారు.