బట్టలు, వాచ్‌లు కొంటున్నారు.. ఆఫీసులకు వెళుతున్నారు

బట్టలు, వాచ్‌లు కొంటున్నారు.. ఆఫీసులకు వెళుతున్నారు

dresses, offices

lunch box sales: దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు పూర్తిగా ఓపెన్ అవలేదు. కానీ, లంచ్ బాక్సులు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అవి కొంటుంది కేవలం ఆఫీసులకు వెళ్లేవాళ్లేనని తెలిసింది.

నెల రోజులుగా.. ఆఫీసుల ఓపెనింగ్ మొదలైంది. ఇప్పుడు కన్జ్యూమర్ ట్రెండ్ మొత్తం హాట్ టిఫిన్ బాక్సుల మీదే నడుస్తుంది. పైగా అమ్మకాలు 250శాతం జరుగుతుంటే అందులో వంద శాతం టప్పర్ వేర్ వి మాత్రమే ఉంటున్నాయని.. టప్పర్‌వేర్ ఎండీ దీపక్ చాబ్రా చెప్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తుంటే.. పనిచేయడానికి బయటకు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదేక్రమంలో బట్టలు, షూలు, బ్యాక్స్, వాచెస్ అమ్మకాలు పెరిగాయి. ఇండస్ట్రీ అధికారులు చెప్పినట్లుగా నెలనెలకు రికవరీ అవగల్గుతున్నారు.

dresses, offices

dresses, offices

వాచ్ అమ్మకాల్లో ఇంప్రూవ్‌మెంట్: వాచ్ అమ్మకాల్లో క్రమంగా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అన్ని బ్రాండ్లు, లోకల్ వాచ్ అమ్మకాలు మొత్తం పరిగణనలోకి తీసుకున్నారు. వర్క్ ఫ్రమ్ హోం జరిగిన సంవత్సరం లోటును ఇప్పుడు తీరుస్తున్నాయి. ట్రావెలింగ్ కు, ఆఫీసులకు వెళ్లడానికి, పెళ్లిళ్లకు వచ్చేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. కంఫర్ట్ కోసం.. ఫ్యాషనబుల్ వస్తువులు కొనుక్కునేందుకు ఇంట్రస్టింగ్ గా ఉన్నారు. ఇక దీనిపై బాటా ఇండియా కూడా సాక్ష్యంగా మిగిలింది. స్మార్ట్ బిజినెస్ క్యాజువల్ రేంజ్ కు మించి జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ కల్చర్ నుంచి వినియోగదారులు బయటకు వస్తున్నారు. కంఫర్టబుల్, క్యాజువల్ ఫుట్‌వేర్ వాడకం పెరిగాయి.

వాడకం పెరగడానికి చాలా కారణాలు: డిఫరెంట్ సెగ్మెంట్ల వాడకం పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. పండుగ సీజన్లు కావొచ్చు. ఖర్చులు పెరగడం, సామాజిక బంధాలు మెరుగుపరుచుకోవడం కోసం సెలబ్రేషన్స్ చేసుకుంటుండొచ్చు. మహమ్మారి సమయంలో లంచ్ బాక్సులు, బాటిల్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనిని బట్టి చూస్తే లంచ్ & టిఫిన్స్ సెర్చింగ్ గూగుల్ ట్రెండ్స్ లో మళ్లీ కనిపిస్తూ లాక్ డౌన్ కు ముందు పరిస్థితే గుర్తు చేస్తుంది. మరోరకంగా చూస్తే ఎక్కడబడితే అక్కడ తినేసే వారంతా ఆరోగ్యం పట్ల శ్రద్ద పెంచుకుని హోం పుడ్ కే జాగ్రత్త పడుతున్నారు.

జీవితాల్లో మార్పులు రావడానికి: వాచెస్ లో స్మార్ట్ వాచెస్ నే వాడకాలు పెరిగాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెంచారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ వాడకాన్ని పెంచేశారు. చాలా మంది జీవితాల్లో మార్పులు రావడానికి కొవిడ్ అనేది ఉత్ప్రేరకంగా పనిచేసింది. పేమెంట్ గురించి పక్కకుబెట్టి అవుట్‍‌డోర్, ఇన్‌డోర్ లలో స్వేచ్ఛగా యాక్టివిటీ కొనసాగిస్తున్నారు.