Bharat Jodo Yatra: కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్‌తో కలిసి పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రభను పెంచేందుకు కాదని, దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకేనని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

Bharat Jodo Yatra: కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. రాహుల్‌తో కలిసి పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించింది. రాహుల్ తో కలిసి ఇవాళ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రభను పెంచేందుకు కాదని, దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకేనని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

దేశ ప్రతిష్ఠ గురించి తాను ఆందోళన చెందుతున్నానని, అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానని అన్నారు. వ్యక్తిగత కీర్తి కోసం తాము ఈ యాత్రలో పాల్గొనడం లేదని, దేశ ప్రతిష్ఠ కోసమే పాల్గొంటున్నామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన అంశంపై కాంగ్రెస్ వైఖరి గురించి తాను తెలుసుకోవాలని భావించడం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించింది వ్యక్తిగత కారణాల వల్ల కాదని, దేశంలో మతపర ఆందోళనలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకంగా, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ యాత్ర ప్రారంభించారని ఆయన అన్నారు. అరబ్ దేశాలతో స్నేహ బంధం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే, ప్రభుత్వంలో ముస్లిం ప్రతినిధి ఎవరూ లేరని ఆయన విమర్శించారు.

జమ్మూకశ్మీర్ లో 2014లో ఎన్నికలు జరిగాయని, ఇప్పటివరకు జరగలేదని ఆయన అన్నారు. కాగా, రాహుల్ భారత్ జోడో యాత్ర మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఆయన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఆ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొంటూ రాహుల్ కు మద్దతు తెలిపారు.

Uttar pradesh : కొడుకు మృతి..28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్న 70 ఏళ్ల మామ