Pakistan: మోదీలో పాక్ భాగస్వామిని చూడడం లేదు.. మన్మోహన్, వాజ్‌పేయీలో చూసింది: పాక్ మంత్రి

భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి కోసం కలిసి పనిచేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశం ఓ భాగస్వామిగా చూడడం లేదని పాక్ మంత్రి హీనా రబ్బానీ ఖర్ అన్నారు. అయితే, గతంలో భారత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయీని మాత్రం తమ దేశం భాగస్వాములుగా చూసిందని చెప్పుకొచ్చారు.

Pakistan: మోదీలో పాక్ భాగస్వామిని చూడడం లేదు.. మన్మోహన్, వాజ్‌పేయీలో చూసింది: పాక్ మంత్రి

Pakistan

Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి కోసం కలిసి పనిచేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తమ దేశం ఓ భాగస్వామిగా చూడడం లేదని పాక్ మంత్రి హీనా రబ్బానీ ఖర్ అన్నారు. అయితే, గతంలో భారత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయీని మాత్రం తమ దేశం భాగస్వాములుగా చూసిందని చెప్పుకొచ్చారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశం-2023లో దక్షిణాసియా సెషన్ లో హీనా రబ్బానీ ఖర్ మాట్లాడారు. 2011-2013 మధ్య తాను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా భారత్ వెళ్లిన సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి, సమన్వయం కోసం పనిచేశానని, ఇప్పటితో పోల్చుకుంటే అప్పట్లో వాతావరణం చాలా బాగుండేందని చెప్పారు.

అయితే, కొన్నేళ్లుగా శత్రుత్వం పెరిగిపోతోందని చెప్పుకొచ్చారు. ఇది దక్షిణాసియా సమస్య కాదని, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్య అని వ్యాఖ్యానించారు. సమస్య భారత్ నుంచే ఉందని చెప్పుకొచ్చారు. రాజనీతిజ్ఞత కొరవడిందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దృష్టికోణంలో ఆలోచించకుండా, శాంతి కోసం ఆలోచించాలని వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయే స్థితికి చేరిన విషయం తెలిసిందే. అయిన్పటికీ భారత్ పై పాక్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.

World’s smallest spoon: ప్రపంచంలోనే అతి చిన్న చెంచా ఇది.. వీడియో