Pakistan’s inflation: 1975 నుంచి ఎన్నడూలేనంత గరిష్ఠానికి పాక్ ద్రవ్యోల్బణం!
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ సీపీఐ ద్రవ్యోల్బణం 1975 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో 24.47 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం జనవరిలో 27.55 శాతానికి చేరింది. 1975 మేలో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 27.77 శాతంగా నమోదైంది.

Pakistan’s inflation: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ సీపీఐ ద్రవ్యోల్బణం 1975 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత గరిష్ఠానికి చేరింది. డిసెంబరులో 24.47 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం జనవరిలో 27.55 శాతానికి చేరింది. 1975 మేలో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 27.77 శాతంగా నమోదైంది.
ఆ తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారని ది న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ తెలిపింది. పాకిస్థాన్ లో విదేశీ మారక ద్రవ్య కొరత ఉండడంతో ఆహార పదార్థాలు, ముడిసరుకుల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పోర్టుల వద్దే అవి నిలిచిపోయాయని తెలిపింది.
పాకిస్థాన్ గణాంకాల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… 2021-2022 ఆర్థిక సంవత్సరం జులై నుంచి జనవరి మధ్య ద్రవ్యోల్బణం 10.26 శాతంగా ఉంటే 2022-23 మధ్య అదే సమయంలో 25.4 శాతంగా నమోదైంది. గత నెలలో పాక్ లో ఆహార ద్రవ్యోల్బణం కూడా 2011 నుంచి ఎన్నడూ లేనంత పెరిగింది. పాక్ లో మూడింట రెండు వంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. పేద ప్రజలు ఆకలి బాధతో అల్లాడుతున్నారు.
Free Flight Tickets : హాంకాంగ్ కీలక నిర్ణయం.. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు