పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.5 తగ్గింపు: ఆ ఒక్క రాష్ట్రంలోనే..

పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.5 తగ్గింపు: ఆ ఒక్క రాష్ట్రంలోనే..

Petrol – diesel prices: కేంద్ర పెంచుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా వ్యాట్ పెంచేసి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. మేఘాలయలో మాత్రం ఇతర రాష్ట్రాలకు విరుద్ధంగా లీటర్ ధరపై రూ.5 తగ్గించారు. మంగళవారం వరకూ రెండ్రోజుల పాటు కమర్షియల్ ట్రాన్స్‌పోర్టర్లు చేసిన సమ్మె తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.91.26గా ఉన్న పెట్రోల్ ధర రూ.85.86కు, రూ.86.23గా ఉన్న డీజిల్ ధర రూ.79.13కు తగ్గింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధరలపై.. క్యాబినెట్ సహోద్యోగులతో పాటు సీనియర్ గవర్నమెంట్ అధికారులతో చర్చలు జరిపాం. గత వారం తగ్గించిన రూ.2 ధరతో కలిపి మొత్తం మీద రూ.7.4 పెట్రోల్ కు.. రూ.7.1డీజిల్ కు తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి 31.62శాతం తగ్గాయి. అంటే పెట్రోల్ పై 20శాతం, డీజిల్ పై 15శాతం తగ్గిందన్నమాట.

పక్క రాష్ట్రం అస్సాంతో పోటీపడి.. ధరలు తగ్గించినట్లు హర్యానా సీఎం చెప్పారు. రెండ్రోజులుగా కమర్షియల్ ట్రాన్స్ పోర్టర్లు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుండగా.. గవర్నమెంట్ రియాక్ట్ అవకపోతే మాత్రం నిరాహారదీక్షకు కూడా దిగాలని నిర్ణయించుకున్నారు. గతేడాది ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ట్యాక్సుల రూపంలో రూ.326కోట్ల రెవెన్యూను కలెక్ట్ చేసింది.