మోడీ రాసిన గుజరాతీ పద్యం.. సంక్రాంతికి సూర్యుడి వెలుగులు

మోడీ రాసిన గుజరాతీ పద్యం.. సంక్రాంతికి సూర్యుడి వెలుగులు

PM MODI: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాతీలో మకర సంక్రాంతిపై పద్యం రాశారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశవంతమైన సూర్యోదయాన్ని అభివర్ణిస్తూ గేయం రాశాడు. ‘అందరికీ సంక్షేమం కోసం నిర్విరామంగా కదిలే సూర్యుడికి ఈ రోజు గౌరవ వందనం సమర్పించాలి’ అని రాసుకొచ్చారు.

ఆయన తన మాతృభాషలో గురువారం ప్రజలు జరుపుకుంటున్న మకర సంక్రాంతిని గురించి ఆకాశంతో మొదలుపెట్టి రాశారు. అందులో స్టార్టింగ్ లైన్లు ఇలా.. ‘ఆకాశం ఈ సందర్భంగా మొత్తం భూతలమంతా సూర్యుడు, చంద్రుడు వెలుగులతో నిండిపోయింది’ అని రాశారు.

ఆశాశమెత్తు కలలు కనేవారు అత్యున్నత లక్ష్యాలు సాధించగలుగుతారు. కొద్ది పాటి కలలు ఆశయాలతో పోటీపడే వారు రాళ్లు, గులక రాళ్లలా బోలెడు సమస్యలతో మిగిలిపోతారు.

ఆ సూర్యుడు నిరాడంబరంగా.. నిర్విరామంగా.. ఇతరుల క్షేమం కోసం ప్రయాణిస్తూనే ఉంటాడు. ఇవాళ సూర్యుడికి తర్పనం అందించాల్సిన రోజు. నేను సూర్యుడి ముందు మోకరిల్లుతున్నా.. అంటూ మిగతా పద్యం సాగింది. ఇదొక్కటే కాదు మోడీ అతని మాతృభాషలో మరిన్ని పద్యాలు రాశారు. అవి బుక్‌లా కూడా వెలువడ్డాయి.

ఇండియాలోని పలు ప్రాంతాల్లో మకర సంక్రాంతి ఫుల్ జోష్ తో జరుపుకుంటారు. ఈ సందర్భంగా మోడీ.. ప్రకృతిని ప్రశంసిస్తూ పద్యం రాసి ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అందజేశారు మోడీ. మకర సంక్రాంతిని ఒక్కో ప్రదేశంలో ఒక్కో పొంగల్, మాఘ్ బిహూ, పౌష్ సంక్రాంతి, సంక్రాంతి, మకర సంక్రాంతి అని పిలుచుకుని సెలబ్రేట్ చేసుకుంటారు.