ప్రాణం పోయినా లేవనంటూ ధర్నాకు దిగిన ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్

ప్రాణం పోయినా లేవనంటూ ధర్నాకు దిగిన ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్

PM Modi’s brother: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ లక్నో ఎయిర్ పోర్టులో బుధవారం ధర్నాకు దిగారు. పోలీసులు తన అనుచరులను అరెస్టు చేశారంటూ ఆరోపిస్తూ బైఠాయించారు. ‘ఈ రోజు నేను ప్రయాగ్ రాజ్ వెళ్లాను. నిన్నటి నుంచి నా కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. నేను బయటకు వస్తుంటే నా సపోర్టర్లను జైలులోకి తీసుకెళ్లడం ఏమీ బాగాలేదు. అందుకే నిరాహార దీక్ష చేయాలని ఇక్కడ కూర్చున్నా. నీళ్లు, ఆహారం వద్దనుకుంటున్నా. నా ప్రాణం పోయినా ఇక్కడి నుంచి లేచేది లేదు’

ఎందుకిలా చేశారని పోలీసులను ప్రశ్నిస్తే.. పీఎంఓ ఆర్డర్ల ప్రకారమే ఇలా చేశామన్నారు. ఆర్డర్ కాపీని అడిగితే చూపించడం లేదు. వాళ్లు పీఎంఓను కించ పరచాలనుకుంటున్నారు. లేదంటే వాళ్ల దగ్గర కాపీ లేదు’ అని ప్రహ్లాద్ చెప్పారు.

అందిన సమచారం ప్రకారం.. ప్రహ్లాద్ మోడీ సపోర్టర్లను ఎయిర్ పోర్టులోని హై సెక్యూరిటీ జోన్లో సెక్షన్ 144ఉల్లంఘించినందుకు గానూ అరెస్టు చేశారు. వాళ్లను ఇప్పుడు వదిలేశారు కూడా. దాదాపు వంద మంది వరకూ సపోర్టర్లు ప్రహ్లాద్ ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారట.

ఎయిర్ పోర్ట్ అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రహ్లాద్ మోడీ లక్నోకు ఇండిగో విమానంలో సాయంత్రం 4గంటల సమయంలో వచ్చారు. పోలీసులు చేసిన పనికి అసంతృప్తికి గురై ఆయన ధర్నాకు బైఠాయించారు. ఓ గంటన్నర పాటు కూర్చొని తర్వాత వెళ్లిపోయారని వెల్లడించారు.