ప్రియాంక అన్‌ఫినిష్‌డ్.. వామ్మో ఇంత క్రేజా

ప్రియాంక అన్‌ఫినిష్‌డ్.. వామ్మో ఇంత క్రేజా

Priyanka Chopra: హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ మరోసారి క్రెడిట్ కొట్టేశారు. పలు బాధ్యతల్లో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. సినీ న‌టి, ప్రొడ్యూసర్, రైట్స్ యాక్టివిస్ట్, యునిసెఫ్ ప్ర‌చార‌క‌ర్త త‌న జ్ఞాప‌కాల‌పై అన్‌ఫినిష్డ్ అనే పేరుతో కొద్ది రోజుల క్రితమే పుస్తకం రాసి విడుదల చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయిన ఆ పుస్తకం.. స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది.

అందరి ఆదరాభిమానాలు పొంది.. మార్కెట్‌లో ఆవిష్క‌రించిన వారం రోజులలోపే.. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా అన్‌ఫినిష్డ్ బుక్ స్థానం దక్కించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

ప్రియాంక చోప్రా సినీ జీవితంలో మెయిన్ సిచ్యుయేషన్స్, మైలురాళ్ల‌కు సంబంధించిన పిక్చర్స్, స్పెషల్స్‌తో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేశారు. బెస్ట్ సెల్ల‌ర్‌గా అన్‌ఫినిష్డ్ నిలిచినందుకు ఫ్యాన్స్‌కు ప్రియాంక థ్యాంక్స్ చెబుతున్నారు. త‌న‌కు సపోర్ట్‌గా నిలిచిన ఫ్యాన్స్‌కు, బుక్ లవర్స్‌కు కృతజ్ఞ‌త‌లు చెప్పారు.

బుక్ బెస్ట్ సెల్లింగ్ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు విడుదల చేసిన వీడియోకు కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది. ఎంతలా అంటే.. 2గంటల్లోనే 53వేల మంది చూశారు. బుక్ రిలీజ్ చేసినప్పటి వీడియోకు మరింత ఎక్కువ క్రేజ్ అంటే.. 30లక్షల మంది చూసేశారు.