Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు.. నేడు కాంగ్రెస్ సభకు 12 పార్టీలు
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసింది. ఇవాళ శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది. దీనికి దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసింది. ఇవాళ శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించనుంది. దీనికి దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ 21 పార్టీల నేతలను ఆహ్వానించగా వారిలో కొన్ని పార్టీల నేతలు హాజరు కావట్లేదు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ఎండీకే, బిహార్ మంత్రి తేజస్వీ యాదవ్ కు చెందిన ఆర్జేడీ, మహారాష్ట్రనేత శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూతో పాటు పలు పార్టీల ముఖ్యనేతలు ఇవాళ శ్రీనగర్ సభలో పాల్గొంటారు. శ్రీనగర్ లో భద్రతను పెంచారు.
భారత్ జోడో యాత్రను దేశాన్ని ఏకం చేయడానికే నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. పాదయాత్రలో భాగంగా రాహుల్ ను పలు సంఘాల నేతలు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు కలిసి మద్దతు తెలిపారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రభను పెండచడానికి ఈ యాత్ర బాగా ఉపయోగపడిందని విశ్లేషణలు వస్తున్నాయి. రాహుల్ యాత్ర నిన్నటితో 4,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో తదుపరి కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్లనుందన్న ఆసక్తి నెలకొంది.
Nara lokesh: మూడోరోజు నారా లోకేష్ యువగర్జన పాదయాత్ర ఫొటోలు..