బాక్సర్ యాబ్స్ అవి.. రాహుల్ గాంధీ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియా రచ్చ

10TV Telugu News

Rahul Gandhi: భారత బాక్సర్ విజేందర్ సింగ్ రాహుల్ గాంధీ.. ఫొటో పెడుతూ పోస్టు పెట్టాడు. ‘బాక్సర్ యాబ్స్ అవి. మోస్ట్ డేరింగ్ యంగ్ ఫిట్, రాహుల్ గాంధీ ప్రజల నాయకుడు అంటూ రాసుకొచ్చాడు. అసలు ఎందుకు ఈ కామెంట్లు ఎందుకు రాశాడు.. ఆ ఫొటో ఏంటంటే..

ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికలకు కేరళలో పర్యటించారు రాహుల్. మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రంలోకి వెళ్లడంతో పాటు, కాసేపు ఈత కొట్టారు. రాహుల్ స్టామినా చూసి ఆశ్చర్యపోయిన బాక్సర్ విజేందర్ సింగ్, తడిసిన బట్టలతో పడవపై నిలబడివున్న రాహుల్ గాంధీ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. 50 సంవత్సరాల కాంగ్రెస్ నేత, దాదాపు 10 నిమిషాల పాటు సముద్రంలో ఈత కొడుతూ గడపగా, గత వారం వైరల్ అయ్యాయి.

మనం ఇద్దరం.. మనకు ఇద్దరు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమిళనాడులో ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. చైనాను చూసి భయపడుతున్నారని, దేశంలోని కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు.

‘మోడీ ఈ దేశానికి ఉపయోగకరమా? కాదా? అనేది ప్రశ్న కాదు. ఆయన వల్ల ఎవరెవరికి ఉపయోగకరం అనేదే ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. సంపదను అమాంతం పెంచుకుంటున్న ఇద్దరు వ్యక్తులకే అత్యంత ఉపయోగకరంగా ఉన్నారని అన్నారు. పేదలకు మోడీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.

మనం ఇద్దరు (మోదీ, అమిత్ షా), మనకు ఇద్దరు (అంబానీ, అదానీ) అనేదే ప్రధాని నినాదమని రాహుల్ దుయ్యబట్టారు. తమిళనాడు తూత్తుకుడిలోని ఓ కాలేజీలో లాయర్లతో మాట్లాడుతూ ఇలా మాట్లాడారు.