Fell off from moving train: మెరుపు వేగంతో స్పందించి తల్లీకుమారుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్

పిల్లాడితో కలిసి ఓ తల్లి రైలు ఎక్కాలనుకుంది. రైలులో ప్రయాణికులు నిండిపోయి ఉండడంతో డోర్ వద్ద అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆ తల్లీకుమారుడు రైలులోకి వెళ్లలేక ఒక్కసారిగా రైలు-ప్లాట్ ఫాం మధ్య ఉండే ఖాళీ స్థలంలో ఇరుక్కోబోయారు. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోని నేర విభాగ పోలీసులు తల్లీకుమారుడిని ప్లాట్ ఫాం మీదుకులాగి వారి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రలోని మాన్‌ఖుర్ద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Fell off from moving train: మెరుపు వేగంతో స్పందించి తల్లీకుమారుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్

Fell off from moving train: పిల్లాడితో కలిసి ఓ తల్లి రైలు ఎక్కాలనుకుంది. రైలులో ప్రయాణికులు నిండిపోయి ఉండడంతో డోర్ వద్ద అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆ తల్లీకుమారుడు రైలులోకి వెళ్లలేక ఒక్కసారిగా రైలు-ప్లాట్ ఫాం మధ్య ఉండే ఖాళీ స్థలంలో ఇరుక్కోబోయారు.

ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోని నేర విభాగ పోలీసులు తల్లీకుమారుడిని ప్లాట్ ఫాం మీదుకులాగి వారి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రలోని మాన్‌ఖుర్ద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లీకుమారుడిని పోలీసులు కాపాడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

మెరుపువేగంతో స్పందించి వారిని కాపాడిన పోలీసులను అధికారులు అభినందించారు. గతంలోనూ రైల్వే స్టేషన్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రైల్వే పోలీసులు శరవేగంగా స్పందిస్తుండడంతో ప్రాణాపాయం తప్పుతోంది. అయితే, ఇటువంటి ఘటనలు పదే పదే చోటుచేసుకుంటున్నా ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..