లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రాజస్థాన్ మహిళకు 5 నెలల్లో 31సార్లు కరోనా పాజిటివ్

Updated On - 2:36 pm, Sun, 24 January 21

Coronavirus 31 times: రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఐదు నెలల క్రితం కొవిడ్-19కు గురైన యువతికి గత ఐదు నెలలుగా 5సార్లు పాజిటివ్ వచ్చింది. భరత్‌పూర్ లోని ఆర్బీఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మహిళ పరిస్థితికి తగ్గట్లుగా చికిత్స అందిస్తున్నారు. కొవిడ్-19 పాజిటివ్ గా 31సార్లు వచ్చినప్పటికీ కండిషన్ స్థిరంగా ఉంది.

ఆశ్చర్యంగా జిల్లా మొత్తంలో ఆమె ఒక్కరే కొవిడ్-19 పాజిటివ్ పేషెంట్. అప్నా ఘర్ ఆశ్రమ్ మేనేజ్మెంట్ కు చెందిన ఆమెను ప్రస్తుతం జైపూర్ లోని ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్ కు తరలిస్తున్నారు. 2020 ఆగష్ట్ 28న తొలి సారి ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. హెల్త్ కండిషన్ బాగయ్యాక.. ఆమెతో పాటు ఆశ్రమ్ క్వారంటైన్ ఫెసిలిటీలో ఒక అటెండెంట్ ను అప్పగించారు.

ఆశ్రమ వ్యవస్థాపకుడు డా.బీఎమ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ మహిళకు 31సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి మందులు అన్నీ వాడుతున్నాం. ఆమె హెల్త్ కండిషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అన్ని సార్లు కొవిడ్ పాజిటివ్ వచ్చినా ఎటువంటి నీరసం లేకుండా ఉండగలుగుతున్నారు.

ఆరోగ్యంగా తిరుగుతున్నప్పటికీ ఆమెను ఐసోలేషన్ లో ఉంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దాంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని.. టెస్టు రిపోర్టులు నెగెటివ్ వచ్చేంతవరకూ అలాగే వ్యవహరించాలని అంటున్నారు.