#RishabhPant: క్రికెటర్ పంత్ ప్రాణాలు కాపాడిన ఇద్దరిని గణతంత్ర వేడుకల్లో సత్కరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం

ఇవాళ డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీ ఓ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ ప్రాణాలు కాపాడిన హరియాణా రోడ్డు, రవాణా డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న వారిద్దరినీ రాష్ట్ర ప్రభుత్వ సత్కరిస్తుంది’’ అని చెప్పారు.

#RishabhPant: క్రికెటర్ పంత్ ప్రాణాలు కాపాడిన ఇద్దరిని గణతంత్ర వేడుకల్లో సత్కరిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం

#RishabhPant

#RishabhPant: భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ ఘోర కారు ప్రమాదానికి గురైన సమయంలో అతడిని కాపాడిన బస్సు డ్రైవర్, కండక్టర్ ను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీ ఓ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

‘‘తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ ప్రాణాలు కాపాడిన హరియాణా రోడ్డు, రవాణా డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న వారిద్దరినీ రాష్ట్ర ప్రభుత్వ సత్కరిస్తుంది’’ అని చెప్పారు. ఢిల్లీ, డెహ్రాడూన్ హైవేపై వెళ్తున్న సమయంలో రిషబ్ పంత్ కారు డివైడర్ ను ఢీ కొని దాదాపు 200 కిలోమీటర్ల మేర ముందుకు బోల్తా కొడుతూ దూసుకు వెళ్లింది.

అనంతరం ఆ కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆ మార్గం మీదుగా ఓ బస్సు వెళ్తుంది. ఆ బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ కారులో నుంచి పంత్ ను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం పంత్ వారితో ‘నేను రిషబ్ పంత్ ను’ అని చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో డ్రైవర్ సుశీల్ మాట్లాడుతూ… ఆ కారు అద్దాలు పగులగొట్టి పంత్ ను తానే బయటకు లాగానని తెలిపారు. గాయాలపాలైన పంత్ తనను తాను పరిచయం చేసుకున్నాడని అన్నారు. బస్సులో ఆ సమయంలో డ్రైవర్, కండక్టర్ హరిద్వార్ మార్గం నుంచి వస్తుండగా, రిషబ్ పంత్ ఢిల్లీ వైపు నుంచి వచ్చాడు.

NLC Job Vacancies : కేంద్రప్రభుత్వరంగ సంస్ధ నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ