గుడి కోసం రూ.526కోట్లు విరాళమిచ్చాడు.. వివరాలు అడిగేసరికి చిక్కుకుపోయాడు

గుడి కోసం రూ.526కోట్లు విరాళమిచ్చాడు.. వివరాలు అడిగేసరికి చిక్కుకుపోయాడు

Chottanikkara temple: కేరళలోని ఆలయానికి రూ.526 కోట్లు నగదును భూరి విరాళంగా ప్రకటించాడు ఓ వజ్రాల వ్యాపారి. ఆ నిధుల్ని నిరభ్యంతరంగా ఆలయ కమిటీ స్వీకరించింది. కాకపోతే వాటిని వినియోగించేముందు అవి ఎలా వచ్చాయో వివరాలు తెలియజేయాలని అడిగింది పాలక మండలి. దాతను సంప్రదించేసరికి డిటైల్స్ పంపించడానికి గడువు కావాలని కోరాడు. ఈలోపే సదరు సమాచారం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టడం మొదలైంది.

బెంగళూరుకు చెందిన గాన శ్రవణ్‌ అనే వజ్రాల వ్యాపారి కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని చొట్టనిక్కర్‌ భగవతి ఆలయానికి విరాళం ప్రకటించాడు. గత నవంబరులో రూ.526 కోట్లు ఇస్తానని చెప్పాడు. బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపుర తాలూకా చింతామణికి చెందిన వ్యక్తి తాను వజ్రాల వ్యాపారం చేస్తుంటానని చెప్పాడు.

తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఒకరు సూచించారు. 2016లో ఆలయాన్ని సందర్శించిన తర్వాత వ్యాపారంలో అమితంగా సంపాదించనిట్లు తెలిపారు. ఈ కారణంగానే పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించినట్లు చెప్పారు. పూర్తి వివరాలను 60 రోజుల్లోగా సమర్పిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. కేరళకు చెందిన దేవాదాయ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరాల్ని తెలుసుకున్న తరువాతనే ముందుకెళ్లాలని నిర్ణయించింది.