దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: కేంద్ర మంత్రి

దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: కేంద్ర మంత్రి

Covid Dry Run: దేశవ్యాప్తంగా శనివారం కొవిడ్-19 వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రై రన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలన్నింటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ దేశ రాజధానిలో వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. ‘అవును, మెడిసిన్ తో పాటు ట్రీట్‌మెంట్ కూడా ఢిల్లీలో ఉచితంగా అందిస్తున్నాం’ అని చెప్పారు.

దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ఢిల్లీలోనే కాదు.. దేశమంతా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం’ అని ప్రకటించారు. వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రై రన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రకటన చేశారు ఇద్దరు మంత్రులు. అంతకంటే ముందు గురువారం ఈ ప్రక్రియ జనవరి 2న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామంటూ ప్రకటించారు మంత్రి.

అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, దర్యాగంజ్, వెంకటేశ్వర్ హాస్పిటల్, ద్వారకా, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ ఢిల్లీలోని ఈ మూడు ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ హెల్త్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్ లో డ్రై రన్ గురించి ప్రకటించారు.

ఫ్రీజర్లు ఏర్పాటు చేసి చైన్ ఎక్విప్‌మెంట్ సహకారంతో అరేంజ్‌మెంట్స్ చూస్తున్నట్లు.. ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ భద్రపరిచినట్లు తెలియజేశారు. వ్యాక్సిన్ రిసీవ్ చేసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉంది. ముందుగా తొలి దశలో 51లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ డిసెంబర్ 24న తెలిపారు.

హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 50ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.