వాట్సప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం నోటీసులు

వాట్సప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం నోటీసులు

Facebook – WhatsApp: ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్లు వాట్సప్ ఫేస్‌బుక్‌లకు కొత్త ప్రైవసీ పాలసీని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన ఏర్పాటు చేసిన బెంచ్.. యూజర్ల డేటాపై వచ్చిన ఆరోపణలు పరిశీలించాం.

మీరు 2నుంచి 3ట్రిలియన్ డాలర్ల్ కంపెనీ అయి ఉండొచ్చు. కానీ, ప్రైవసీ పాలసీ చాలా ఇంపార్టెంట్. అది కాపాడటం మీ విధి. అని అపెక్స్ కోర్టు వాట్సప్, ఫేస్ బుక్ లకు చెప్పింది. గత నెలలో వాట్సప్ తన ప్రైవసీ పాలసీలోని మార్పులను వెనక్కు తీసుకోవాలని కేంద్రం చెప్పింది. ఈ మార్పులు తప్పు.. ఆమోదయోగ్యం కానివి.

పౌరులు తమ డేటా పోతుందని.. ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. వారి చాటింగ్, డేటా ఇతరులు షేర్ చేసుకుంటారనే భయం ఉందని అపెక్స్ కోర్టు నోటీసులు వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం, వాట్సప్‌ల నుంచి నాలుగు వారాల్లోగా దీనిపై రెస్పాన్స్ రావాలని కోర్టు ఆదేశించింది. యూరోపియన్ యూసర్లతో పోలిస్తే.. ఇండియన్ల ప్రైవసీ విలువలు ఎందుకంత తక్కువగా ఉన్నాయో తెలియజేయాలని ఆదేశించింది.