నెంబర్ ప్లేట్లు వేర్వేరు రంగుల్లో ఉండటం వెనుక కారణాలివే..

నెంబర్ ప్లేట్లు వేర్వేరు రంగుల్లో ఉండటం వెనుక కారణాలివే..

Number plate colours: గ్రీన్ నెంబర్ ప్లేట్ ఎప్పుడైనా చూశారా.. చూస్తే ఒకవేళ దాని అర్థం ఏంటో తెలుసుకున్నారా.. అలా కాదంటే బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ దానిపై ప్రత్యేకమైన కోడ్ తో ఉన్నవి చూశారా.. మన దేశంలో తరచూ వాటిని ఎందుకు వాడరో ఐడియా ఉందా..

తరచూ మనం చూసే నెంబర్ ప్లేట్ కేవలం వైట్.. దానిపై బ్లాక్ లెటర్స్ మాత్రమే. అవి కాకుండా ఇంకా కొన్ని రకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. వాహనాన్ని బట్టి నెంబర్ ప్లేట్ ఇష్యూ చేస్తుంటారు అధికారులు.

వైట్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్
రెగ్యూలర్ గా మనం చూసే వాహనాలకు వైట్ ప్లేట్లు బ్లాక్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ కార్లకు మాత్రమే వీటిని వాడతారు. వస్తువులను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి, ప్రయాణికులను ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చడానికి ఈ నెంబర్ ప్లేట్ వాడరు.

పసుపు ప్లేట్ పై నలుపు అక్షరాలు
పసుపు నెంబర్ ప్లేట్ మీద నల్లటి అక్షరాలు కమర్షియల్ వాహనాలకే సెట్ అవుతాయి. వస్తువుల రవాణాకు, ప్యాసింజర్ల కోసం వాడుతుంటారు. ఓలా, యూబర్ క్యాబ్స్ లాంటి క్యాటగిరీకి ఇవి వస్తాయి.

గ్రీన్ ప్లేట్ మీద వైట్ లెటర్స్
ఇవి చాలా కొత్తగా కనిపిస్తున్న నెంబర్ ప్లేట్లు. దీనిని బట్టి ఆ వాహనం ఎలక్ట్రిక్ వెహికల్ అని కన్ఫామ్ చేసుకోవచ్చు. లీగల్ గా తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కు ఇవి అమరుస్తారు.

బ్లూ ప్లేట్ మీద వైట్ లెటర్స్
విదేశీ డిప్లొమేట్స్ వాడే వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్ ఉంటుంది. వీరికి రాష్ట్రానికి సంబంధించిన కోడ్ కు బదులు దేశాన్ని రిప్రజెంట్ చేసే కోడ్ ఉంటుంది.

పైకి వెళ్లే బాణం గుర్తుతో కనిపించే నెంబర్ ప్లేట్
న్యూ ఢిల్లీలో ఉండే రిజిష్టర్డ్ మిలటరీ వెహికల్ కు ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ముందు లేదా రెండో అక్షరం ఉండే స్థానంలో బాణం గుర్తు ఉంటుంది. ఆ కోడ్ లో ఒక్కో డిజిట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది.

రెడ్ ప్లేట్ మీద తెల్లటి అక్షరాలు
రెడ్ ప్లేట్ మీద తెల్లని అక్షరాలతో ఉన్న ప్లేట్ ను టెంపరరీ రిజిష్ట్రేషన్ కింద వాడతారు. ఆర్టీఓ నుంచి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందేంతవరకూ అది తప్పదు. ఈ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఒక నెల మాత్రమే వ్యాలిడ్ గా ఉంటుంది. అయితే అన్ని రాష్ట్రాలు ఇలాంటి టెంపరరీ రిజిష్టర్డ్ వెహికల్స్ ను రోడ్ల మీదకు అనుమతించవు.