వ్యాక్సిన్ దుష్ప్రభావానికి మేమే బాధ్యత వహిస్తామని గవర్నమెంట్‌కు చెప్పాం: సీరం, భారత్ బయోటెక్

వ్యాక్సిన్ దుష్ప్రభావానికి మేమే బాధ్యత వహిస్తామని గవర్నమెంట్‌కు చెప్పాం: సీరం, భారత్ బయోటెక్

Serum Institute and Bharat Biotech: కొవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ యూస్ కోసం ఆథరైజేషన్ తెచ్చేసుకున్నాయి. ఈ మేరకు వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలుంటే దానికి మేమే బాధ్యత వహిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు అంటున్నాయి. ఎటువంటి డ్యామేజీనైనా తామే భరిస్తామని చెబుతున్నాయి.

CDSCO/Drugs and Cosmetics Act/ DCGI Policy/అప్రూవల్ కోసం చేసిన కొనుగోలు అగ్రిమెంట్లో ఈ విషయం పొందుపరిచారు. ‘ఏదైనా సీరియస్ ఇబ్బంది అయితే.. గవర్నమెంట్ కు ఇన్ఫామ్ చేస్తామని’ కాంట్రాక్ట్ లో రాసుకొచ్చారని బీబీఐఎల్ స్పష్టం చేసింది. కొనుగోలు ఒప్పందంలో ఇది క్లియర్ గా రాశారు. యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించినట్లయితే నష్టపరిహారం చెల్లిస్తామని ఎలా చెప్పిందో అలా ఇండియాలోనూ చేయాలని ప్రభుత్వం చెప్పింది.

ఆదార్ పూన్వాలా, సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యాక్సిన్ గురించి భయం పోగొట్టేలా చేయాలి. వ్యాక్సిన్ పై అనుమానం వ్యక్తం చేస్తుండటంతో.. వ్యాక్సిన్ తయారీచేయని సంస్థలతో పాటు సాధారణ మనుషులలో కూడా దీనిపై వ్యతిరేకత మొదలవుతోంది.

పలుమార్లు చెప్పిన భారత్ బయోటెక్, సీరంలు వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ తో చాలా మందికి రిలీఫ్ వస్తుంది. ఏదైనా దుష్ఫ్రభావం జరిగితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేమే చూసుకుంటామని చెప్తూ వచ్చాయి.