Bihar Politics Crisis: 164 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉంది.. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడుతుంది: నితీశ్

బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు నితీశ్ కుమార్. పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశానని అన్నారు. బిహార్ లో మహాఘట్‌బంధన్ (మహా కూటమి) ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. తాను తమ పార్టీ నేతలతో చర్చలు జరిపానని, ఎన్డీఏ నుంచి వైదొలగాలని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

Bihar Politics Crisis: 164 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉంది.. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడుతుంది: నితీశ్

Nitish

Bihar Politics Crisis: బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు నితీశ్ కుమార్. పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశానని అన్నారు. బిహార్ లో మహాఘట్‌బంధన్ (మహా కూటమి) ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. తాను తమ పార్టీ నేతలతో చర్చలు జరిపానని, ఎన్డీఏ నుంచి వైదొలగాలని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. వారి అభిప్రాయానికి అనుగుణంగా సీఎం పదవికి రాజీనామా చేశానని అన్నారు.

లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిగిందని చెప్పారు. పార్టీ సభ్యులు అందరి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశానని అన్నారు. ఏడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సహా ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన సంతకాలను సమర్పించామని వివరించారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్నారని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పామని అన్నారు. కాగా, నితీశ్ కుమార్ షాక్ ఇవ్వడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో పడింది బీజేపీ.

బీజేపీ బిహార్ అధ్యక్షుడు సంజయ్ జయస్ ​వాల్ మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి బీజేపీ పోటీ చేసిందని, తమకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్​ కుమార్​నే సీఎంను చేశామని అన్నారు. నితీశ్ కుమార్ తీరు రాష్ట్ర ప్రజలను, బీజేపీని మోసం చేసేలా ఉందని చెప్పారు. బిహార్‌లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది.

Telangana Cabinet: ఎల్లుండి తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్