పెట్రోల్ ధరల పెంపుపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

పెట్రోల్ ధరల పెంపుపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

MLA arrest: జాతీయవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసనగా.. దుకాణాలు మూసేయించారు.

దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటూ దుకాణాలు మూసేయించడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉందని అటువంటివి లేకుండా ఇలా చేయడంపై యాక్షన్ తీసుకుంటూ అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ పెట్రోల్ ధరల పెంపుదలపై శనివారం హాఫ్ డే బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.

ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘బీజేపీ ప్రభుత్వ శనివారాన్ని గుడ్ డే గానే ఉంచాలి. ఈ రోజైనా ధరలు పెంచకుండా ఉండాలి. ఈ ఇందన ధరల పెంపు సామాన్య ప్రజలకు ఖరీదైనవిగా మారిపోతున్నాయి’ అని ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇలా రెస్పాండ్ అయ్యారు. మోడీ గవర్నమెంట్ పై విమర్శలను క్యాప్షన్స్ రూపంలో రాసుకొచ్చారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా పెట్రోల్ ధరల పెంపు గురించి ట్వీట్ చేశారు.