బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైన ఆరుగురు క్రికెటర్లు

బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైన ఆరుగురు క్రికెటర్లు

BCCI fitness test: బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్యూర్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకరిద్దరు కాదు ఆరుగురు ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీశ్ రానా, లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ రాముల్ తెవాటియా, సీమర్స్ సిద్దార్థ్ కౌల్, జయదేవ్ ఉనదక్త్ లు రెండు కిలోమీటర్లు పరుగుపందెంలో ఓడిపోయినట్లు సమాచారం.

బీసీసీఐ ఈ వారమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వేదికగా 2కిలోమీటర్లు పరుగుపందాన్ని పరిచయం చేసింది. ‘ఇది కొత్త రకం ఫిట్‌నెస్ టెస్ట్. ఇది క్లియర్ చేయడానికి వారికి మరో డేట్ ఇస్తారు. ఒకవేళ ఈ టెస్టుక్లియర్ చేయడం ఫెయిల్ అయితే.. స్వదేశంలో జరుగుతున్న ఇంగ్లాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలకు ఆడించడం డౌటే.

2018లో మొహమ్మద్ షమీ, అంబటి రాయుడు యోయో టెస్టు క్లియర్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ నెపంతోనే వారిని ఇంగ్లాండ్ పర్యటనలో లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ లో ఆడించలేదు. శాంసన్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడిన ఇండియన్ టీంలో గతేడాది నుంచి భాగంగా ఉన్నాడు.

20మంది వరకూ ఇండియన్ క్రికెటర్లపై కొద్దిపాటి ఫిట్‌నెస్ టెస్టులు చేశాం. స్వదేశంలో ఇంగ్లాండ్ తోజరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కు ఆడించేందుకు టీ20 వరల్డ్ కప్ కోసం ఈ పరీక్షలు చేశాం. ఈ టెస్టులన్నింటిలో యోయో టెస్టుతో పాటు 2కిలోమీటర్ల పరుగును కూడా యాడ్ చేశాం. ఇందులో బ్యాట్స్ మన్, వికెట్ కీపర్, స్పిన్నర్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా 8నిమిషాల 30సెకన్లలో పూర్తి చేయాలి. అది ఫాస్ట్ బౌలర్ కు 8నిమిషాల 15సెకన్లలోనే దాటేయాలి. కొందరు ఇది మేనేజ్ చేయలేకపోయారు.

యోయో టెస్టులాగే.. ఇది కూడా తప్పనిసరి. కోహ్లీ, శాస్త్రి దీనికి ఒప్పుకున్నారు. క్రికెట్ లో ఇదొక మైలురాయిగా మారడం ఖాయం’ అని బీసీసీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు.