దమ్ముంటే గుజరాత్ ఎన్నికల్లో పోటీచేయమని రాహుల్‌కు స్మృతీ సవాల్

దమ్ముంటే గుజరాత్ ఎన్నికల్లో పోటీచేయమని రాహుల్‌కు స్మృతీ సవాల్

smriti-irani

Smriti Irani Gujarat Polls: కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ స్మృతీ ఇరానీ మంగళవారం చాలెంజ్ కు దిగారు. దమ్ముంటే గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసి చూపించమని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీతో పాటు అతని పార్టీ అవాంతరాలు కలుగజేయడం కొత్తేం కాదని.. ఐకమత్యానికి ప్రతీకగా బీజేపీ ప్రభుత్వం నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కూడా తొలినాళ్లలో అడ్డుతగిలారని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ మాజీ చీఫ్.. ను టార్గెట్ చేస్తూ అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీ వర్కర్ల వేతన పెంపు గురించి మాట్లాడారని ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ అస్సాంలో రీసెంట్ గా మాట్లాడారు. టీ కార్మికుల శ్రమను దోచుకుని సంపాదించుకున్న గుజరాతీల జేబుల్లో నుంచి డబ్బులు బయటకు తీస్తాను. అంతకంటే ముందు పీఎం నరేంద్ర మోడీతో వారికి ఇబ్బందులు ఉన్నాయని.. ఇప్పుడు టీ తాగే వాళ్లపైకి అవి డైవర్ట్ అవుతున్నాయని’ అన్నారు.

నేను రాహుల్ గాంధీని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. దమ్ముంటే గుజారాత్ లోని అజ్మాలో పోటీ చేయమనండి చూద్దాం. అప్పుడు ఆయన దురభిప్రాయాలన్నీ పటాపంచలు అవుతాయని కేంద్ర మంత్రి ఇరానీ చెప్పారు. రాహుల్ ఆ ర్యాలీలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే టీ కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు.

టీ కార్మికుల వేతనం రోజుకు రూ.167వస్తుంది. దానిని రూ.365కు పెంచుతామని.. వ్యాపారులు లాక్కుంటున్న సొమ్మును బయటకు తీస్తామని చెప్పారు.