మేకను బలిచ్చాడని ఎస్ఐ సస్పెండ్

మేకను బలిచ్చాడని ఎస్ఐ సస్పెండ్

police-suspended

Sub-Inspector Suspend: ప్రభుత్వ అధికారి.. సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి మేకను బలివ్వడంతో సస్పెన్షన్ కు గురి కావాల్సి వచ్చింది. బరాన్ జిల్లా సమీప ప్రాంతంలో జరిగిన ఘటన కారణంగా కోటా జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐని సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై యాక్షన్ తీసుకున్నారు.

54సెకన్ల పాటు ఉన్న వీడియోలో.. పోలీసు అధికారి స్వయంగా మేక గొంతుకోసి చంపాడు. రెండ్రోజుల తర్వాత అది ట్విట్టర్లో చక్కర్లు కొడుతుండటంతో యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ దృష్టిలో పడింది. అందులో ఉన్న వ్యక్తి కోటా జిల్లా డియోలీ మంఝీ పోలీస్ స్టేషన్ అధికారి భన్వర్ సింగ్‌గా గుర్తించారు.

కోటా రూరల్ ఎస్పీ శరద్ చౌదరి గురువారం దీనిపై విచారణ చేయాలంటూ ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా అతణ్ని క్రమశిక్షణా చర్యల రీత్యా కేసు ఫైల్ చేసి సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఘటన జరిగిన ఫిబ్రవరి 19వ రోజు అధికారి లీవ్ లో ఉన్నాడు.

అతని మనువడు పుట్టు వెంట్రుకలు తీయించడానికి సొంత ఊరు వెళ్లాడు. పరద్వా గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉంది.