Sugar exports: చక్కెర ఎగుమతులపై ఉన్న నిషేధం మరో ఏడాది పాటు పొడిగింపు

దేశంలో చక్కెర ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ నిషేధం 2023, అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చక్కెర ఎగుమతులపై 2022 జూన్ 1 నుంచి అక్టోబరు 31 వరకు నిషేధం విధిస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గడువు ఎల్లుండితో ముగియనుండడంతో దాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఇవాళ నిర్ణయించింది.

Sugar exports: చక్కెర ఎగుమతులపై ఉన్న నిషేధం మరో ఏడాది పాటు పొడిగింపు

Sugar exports: దేశంలో చక్కెర ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ నిషేధం 2023, అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చక్కెర ఎగుమతులపై 2022 జూన్ 1 నుంచి అక్టోబరు 31 వరకు నిషేధం విధిస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గడువు ఎల్లుండితో ముగియనుండడంతో దాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఇవాళ నిర్ణయించింది.

నిషేధం కొనసాగుతున్నప్పటికీ దేశం నుంచి సీఎక్స్‌ఎల్, టీఆర్‌క్యూ కోటా కింద యురోపియన్ యూనియన్, అమెరికాకు మాత్రం చక్కెర ఎగుమతులు జరుగుతాయి. చక్కెర ఎగుమతుల కోసం తీసుకోవాల్సిన తప్పనిసరి అనుమతుల విషయంలో నిబంధనలు కొనసాగుతాయని నోటిఫికేషన్ లో అధికారులు వివరించారు.

దేశంలో చక్కెర ధరలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చక్కెర ఎగుమతులపై నిషేధం విధించినట్లు చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..