Independence Day flag hoisting: జెండా వందనం కోసం బడికి వెళ్ళిన విద్యార్థులు.. టీచర్లు, సిబ్బంది రాకపోవడంతో నిరాశతో తిరిగి ఇంటికి..

అణువణువునా నిండిన దేశభక్తితో టీచర్లు, విద్యార్థులు ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే ఓ బడిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది. జెండా వందనం చేయడానికి ఓ పాఠశాల విద్యార్థులు ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో బడికి వచ్చారు. అయితే, అక్కడ పాఠశాల టీచర్లు, ఇతర ఉద్యోగులు ఎవరూ లేరు. దీంతో విద్యార్థులు ఎంతో నిరాశతో పాఠశాల నుంచి వెనుదిరిగారు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Independence Day flag hoisting: జెండా వందనం కోసం బడికి వెళ్ళిన విద్యార్థులు.. టీచర్లు, సిబ్బంది రాకపోవడంతో నిరాశతో తిరిగి ఇంటికి..

Independence Day flag hoisting

Independence Day flag hoisting: అణువణువునా నిండిన దేశభక్తితో టీచర్లు, విద్యార్థులు ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే ఓ బడిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది. జెండా వందనం చేయడానికి ఓ పాఠశాల విద్యార్థులు ఉదయాన్నే ఎంతో ఉత్సాహంతో బడికి వచ్చారు. అయితే, అక్కడ పాఠశాల టీచర్లు, ఇతర ఉద్యోగులు ఎవరూ లేరు. దీంతో విద్యార్థులు ఎంతో నిరాశతో పాఠశాల నుంచి వెనుదిరిగారు.

విద్యార్థుల్లో దేశ భక్తి నింపి, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే జెండా వందనానికి రాకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హరైయా డైవలప్ మెంట్ బ్లాక్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు బడికి వచ్చి జెండా ఆవిష్కరించకుండా ఇంట్లోనే ఉంటూ సెలవును ఎంజాయ్ చేసిన టీచర్లు, పాఠశాల సిబ్బందిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

అంతకుముందు పాఠశాల ఎదుట వారు ధర్నాకు దిగారు. ఆ పాఠశాల టీచర్లు, సిబ్బందిపై కేసు నమోదు చేశామని, దీనిపై విచారణకు ఆదేశించామని పోలీసులు తెలిపారు. ఈ తతంగం అంతా ముగిశాక భయపడిపోయిన టీచర్లు ఓ వంట మనిషిని పాఠశాల వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు పంపి, అతడితోనే జెండా ఎగరేయించారు. ఈ చర్యపై గ్రామస్థులు మరింత మండిపడ్డారు.

China-Taiwan conflict: చెప్పినట్టుగానే మళ్ళీ తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన చైనా