Tejashwi Yadav On meeting with Sonia Gandhi: ‘ఇక దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది’.. సోనియాతో భేటీ తర్వాత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు

బిహార్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న వేళ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిసి కీలక అంశాలపై చర్చించారు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతపర ఘర్షణల వల్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై భవిష్యత్తు కార్యాచరణ, వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉందని చెప్పారు.

Tejashwi Yadav On meeting with Sonia Gandhi: ‘ఇక దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది’.. సోనియాతో భేటీ తర్వాత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Bihar Politics Crisis

Tejashwi Yadav On meeting with Sonia Gandhi: బిహార్‌లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న వేళ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిసి కీలక అంశాలపై చర్చించారు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మతపర ఘర్షణల వల్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై భవిష్యత్తు కార్యాచరణ, వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉందని చెప్పారు.

సరైన సమయానికి నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి చెంపపెట్టు వంటిదని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు బీసీలు, దళితుల మద్దతు అధికంగా ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. ప్రస్తుతం బీజేపీపై ఒత్తిడి పెరిగిందని, దీంతో దేశంలో నెలకొన్న నిజమైన సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతోందని చెప్పారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీలు అనేవే ఉండబోవని, ప్రజాస్వామ్యం అంతమవుతుందని అన్నారు. దేశంలో నిరంకుశ పాలన ఉంటుందని చెప్పారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా తేజస్వీ యాదవ్ పలువురు ప్రతిపక్ష నేతలను కలిశారు. దేశంలో బీజేపీని ఓడించడానికి ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

Shirdi Saibaba Temple: షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్