#BharatJodoYatra: మీరు చెప్పేది వినడానికే ఈ యాత్ర చేస్తున్నాను: రాహుల్ గాంధీ

‘‘ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయం. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పే వినేందుకు. మేము ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాము. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తాం. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతాం. ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయొచ్చని మేము భావిస్తున్నాం’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

#BharatJodoYatra: మీరు చెప్పేది వినడానికే ఈ యాత్ర చేస్తున్నాను: రాహుల్ గాంధీ

I consider BJP my 'guru', says Rahul Gandhi

#BharatJodoYatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్ లోని ఫతేహగ్ సాహిబ్ లో రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో స్థానికులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను రాహుల్ గాంధీ సందర్శించుకున్నారు. అనంతరం ఫతేహగ్ సాహిబ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

‘‘ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయం. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పే వినేందుకు. మేము ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాము. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తాం. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతాం. ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయొచ్చని మేము భావిస్తున్నాం’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొన్ని రోజుల్లో ముగియనుంది. కన్యాకుమారి నుంచి ఆయన భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాము 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాకుండా దేశాన్ని ఏకం చేసేందుకే భారత్ జోడో యాత్రను చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీని రైతు, విద్యార్థి, ఇతర సంఘాల ప్రతినిధులు, సినీనటులు, మాజీ అధికారులు కలుస్తున్నారు.

Black Grapes : జుట్టు, చర్మ ఆరోగ్యానికి నల్ల ద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!