Manish Sisodia to centre: అందుకే ఉచితాలు వద్దని బీజేపీ నేతలు అంటున్నారు: మనీశ్ సిసోడియా

'దోస్త్ వాదీ' మోడల్ ను పాటిస్తూ బీజేపీ తమ స్నేహితుల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని ఆయన ఆరోపించారు. సామాన్య ప్రజలకు మాత్రం ఆరోగ్యం, విద్య అందకుండా చేస్తోందని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. ఇలాచేస్తే విద్యార్థులను బలవంతంగా ప్రైవేటు బడులకు, రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపవచ్చని అనుకుంటోందని చెప్పారు. ఈ ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులు చాలా వరకు బీజేపీ నేతల స్నేహితులకు చెందినవేనని ఆరోపించారు.

Manish Sisodia to centre: అందుకే ఉచితాలు వద్దని బీజేపీ నేతలు అంటున్నారు: మనీశ్ సిసోడియా

Manish Sisodia to centre: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. దేశంలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ‘ఉచితాల’ హామీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉచితాలను ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం సమర్థిస్తోంది. కొన్ని నెలల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే విద్యుత్తు, విద్య వంటి వాటిని ఉచితంగా అందించే విషయంపై పలు హామీలు ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండడంతో మనీశ్ సిసోడియా ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దోస్త్ వాదీ’ మోడల్ ను పాటిస్తూ బీజేపీ తమ స్నేహితుల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

సామాన్య ప్రజలకు మాత్రం ఆరోగ్యం, విద్య అందకుండా చేస్తోందని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. ఇలాచేస్తే విద్యార్థులను బలవంతంగా ప్రైవేటు బడులకు, రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపవచ్చని అనుకుంటోందని చెప్పారు. ఈ ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులు చాలా వరకు బీజేపీ నేతల స్నేహితులకు చెందినవేనని ఆరోపించారు.

పేద విద్యార్థి ఫీజు కట్టకపోతే అతడిని బడి గేటులోపలికి కూడా రానివ్వబోరని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు మాత్రం దోస్త్ వాదీ మోడల్ తో ధనవంతుల రుణాలు మాఫీ చేస్తున్నారని, రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయడం లేదని చెప్పారు. విద్యార్థులకు ఉచిత విద్య అందకూడదని భావిస్తున్నారని మనీశ్ సిసోడియా ఆరోపించారు.

Shirdi Saibaba Temple: షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్