Total lunar eclipse: నవంబరు 8న సంపూర్ణ చంద్ర గ్రహణం

పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన పక్షం రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబరు 25న పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబరు 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కోల్ కతాతో పాటు దేశంలో అన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం చూడొచ్చు. అలాగే, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియాలోని ఇతర పలు దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర అట్లాంటిక్ సముద్రం, పసిఫిక్ సముద్రంలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు.

Total lunar eclipse: నవంబరు 8న సంపూర్ణ చంద్ర గ్రహణం

Total lunar eclipse: పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన పక్షం రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబరు 25న పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబరు 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కోల్ కతాతో పాటు దేశంలో అన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం చూడొచ్చు. అలాగే, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియాలోని ఇతర పలు దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర అట్లాంటిక్ సముద్రం, పసిఫిక్ సముద్రంలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు.

లాటిన్ అమెరికాలో పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు. నవంబరు 8న మధ్యాహ్నం 2:39 గంటల నుంచి పాక్షిక చంద్ర గ్రహణం ప్రారంభమై 3:46 గంటలకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది.

సంపూర్ణ చంద్ర గ్రహణం సాయంత్రం 5:11 గంటలకు, పాక్షిక చంద్ర గ్రహణం సాయంత్రం 6:19 గంటలకు ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం నుంచి గ్రహణాన్ని చూడొచ్చు. ముఖ్యంగా కోల్ కతాలో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పూర్తి స్థాయిలో చూడొచ్చు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..