భారత్ కు భారీ విరాళం ప్రకటించిన ట్విట్టర్

భారతదేశంలో COVID-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్

భారత్ కు భారీ విరాళం ప్రకటించిన ట్విట్టర్

India Twitter

Twitter donations :  భారతదేశంలో COVID-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేర్, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే సోమవారం ట్వీట్ చేశారు. CARE కి 10 మిలియన్ డాలర్లు ఇవ్వగా, ఎయిడ్ ఇండియా మరియు సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎలకు ఒక్కొక్క సంస్థకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళం ఇచ్చారు. కాగా ఈ మొత్తాన్ని “ప్రభుత్వ ఆసుపత్రులు,COVID-19 సంరక్షణ కేంద్రాలు, వైద్య పరికరాల కోసం వినియోగించాలని ఆయన కోరారు.

ఇదిలావుంటే భారత్ లో కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం కొత్తగా 3 లక్ష 29 వేల 379 కొత్త అంటువ్యాధులు నమోదు అయ్యాయి, 3.55 లక్షల కరోనా సోకినవారు నయమయ్యారు. 62 రోజుల తరువాత కొత్త రోగుల కంటే ఎక్కువ మంది రోగులు అంటువ్యాధి నుంచి కోలుకున్నారు.