లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

టీనేజర్‌పై మత మార్పిడి కేసు నమోదు

Updated On - 2:30 pm, Sun, 24 January 21

Anti Conversion Law: టీనేజర్‌పై మత మార్పిడి, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు ఘాజిపూర్ పోలీసులు. 15ఏళ్ల బాలిక మార్కెట్ లో మెడిసిన్ కొనుగోలు చేయడానికి వెళ్తుండగా.. 17ఏళ్ల టీనేజర్ అపహరించాడని.. ఈ కారణంతో పాటు అతనిపై మతమార్పిడి చట్టం కింద కేసు నమోదైంది.

శుక్రవారం ఆ వ్యక్తితో బాలికను పట్టుకున్నారు పోలీసులు. ‘ఆ బాలుడ్ని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నాం. అక్కడి నుంచి ప్రొటెక్షన్ హోంకు పంపిస్తాం. మెజిస్ట్రేట్ ముందు బాలిక ఇచ్చే స్టేట్ మెంట్ ను పరీక్షించాల్సి ఉంది’ అని సర్కిల్ ఆఫీసర్ ఘటనపై స్పందించారు.

మెడికల్ పరీక్షలు చేసి బాలికను కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. ఆ రోజు మధ్యాహ్నం బాలిక మెడిసిన్ కొనుక్కునేందుకు బయటకు వెళ్లింది. పక్క ఊరుకు చెందిన వ్యక్తి ఓ కారులో బాలికను ఎక్కించుకుని వెళ్లిపోయాడు. వెంటనే బాలిక కుటుంబానికి విషయం తెలియజేశాం. లక్నోలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తికి దీనిపై సమాచారం ఇచ్చాం.

ఆ తర్వాత రోజే బాలిక తల్లి లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ ిచ్చింది. పెళ్లి చేసుకోవడానికే తీసుకెళ్లిపోయిండొచ్చని.. మతమార్పిడికి కూడా ప్రయత్నించి ఉండొచ్చని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

బాలుడి మీద అతనికి సహాయపడ్డ ఇద్దరు వ్యక్తులపైనా బాలిక తల్లి కంప్లైంట్ ఇచ్చింది. కిడ్నాప్ చేసినందుకు గానూ, బలవంతపు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ.. కేసులు ఫైల్ చేశారు. విషయం కన్ఫామ్ చేసుకునేందుకు బాలిక స్నేహితులను ప్రశ్నించనున్నారు పోలీసులు.

బాలిక చదువుకునే స్కూల్.. బాలుడి ఇంటికి దగ్గర్లో ఉండేదని ఆమె తల్లి చెప్తుంది. 17జిల్లాల్లో మొత్తం 19మత మార్పిడి కేసుల వరకూ నమోదైయ్యాయి.